తెలంగాణ

telangana

కొవిడ్‌ చికిత్సకు మధుమేహం, ఊబకాయ ఔషధాలు!

By

Published : Oct 12, 2021, 8:32 AM IST

COVID DRUG

కొవిడ్ చికిత్స (Covid treatment) కోసం మధుమేహం, ఊబకాయానికి వాడే ఔషధాలు (Drugs to cure Covid 19) వినియోగించవచ్చని ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పరిశోధకులు పేర్కొన్నారు. వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు వాడుతున్న రేపమైసిన్‌ ఔషధం, రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించే మెట్‌ఫార్మిన్‌ను కొవిడ్‌ చికిత్సలో వాడొచ్చని చెప్పారు.

మధుమేహం, ఊబకాయానికి వాడే ఔషధాలు కొవిడ్‌-19 చికిత్సలోనూ (Covid treatment) ఉపయోగపడతాయని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌) పరిశోధకులు కనుగొన్నారు. కొవిడ్‌, వృద్ధాప్యం, మధుమేహం మధ్య జీవ అణువుల సంబంధాన్ని వీరు తమ పరిశోధనలో సమీక్షించారు. (Drugs to cure Covid 19)

"మొక్కలనుంచి వచ్చే ఆహారంలో కనిపించే పాలీఫెనాల్స్‌..ఉదాహరణకు కర్క్‌మిన్‌ (పసుపులో కనిపించేవి), రెస్వరెట్రాల్‌ లాంటివి వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తాయి. వీటిలోనూ వైరస్‌ను నిరోధించే లక్షణాలు ఉంటాయి" అని ఐఐఎస్‌ఈఆర్‌ శాస్త్రవేత్త అమ్జాద్‌ హుస్సేన్‌ తెలిపారు. (Covid drug)

వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు వాడుతున్న రేపమైసిన్‌ ఔషధం, రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించే మెట్‌ఫార్మిన్‌ను కూడా కొవిడ్‌ చికిత్సలో వాడొచ్చని హుస్సేన్‌ చెప్పారు. ఈ పరిశోధనను మాలిక్యులర్‌ అండ్‌ సెల్యూలార్‌ బయోకెమిస్ట్రీ జర్నల్‌ ప్రచురించింది.

ఇదీ చదవండి:మరో విజయం దిశగా ఆస్ట్రాజెనెకా ప్రయోగాలు..!

ABOUT THE AUTHOR

...view details