తెలంగాణ

telangana

Horoscope Today(29-01-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?

By

Published : Jan 29, 2022, 4:30 AM IST

Horoscope Today
ఈ రోజు రాశి ఫలం ()

Horoscope Today(29-01-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today(29-01-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

మేషం...

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

వృషభం...

కీలక వ్యవహారాల్లో శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ కాస్త పెరగుతుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. శారీరక శ్రమ పెరుగుతుంది. లలితాదేవి నామాన్ని స్మరించాలి.

మిథునం..

శుభాలు ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల మరిన్ని శుభఫలితాలను పొందగలుగుతారు.

కర్కాటకం...

కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. ఇష్టదైవ దర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

సింహం..

మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బుద్దిబలం బాగుంటుంది. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శత్రువులు మీ మీద విజయం సాధించలేరు. దుర్గాస్తుతి చదవాలి.

కన్య..

అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శ్రీశివపార్వతులను పూజించడం శుభకరం.

తుల..

ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

వృశ్చికం..

మంచి సమయం. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. అన్నిరకాలుగా మేలు చేకూరుతుంది. శని శ్లోకం చదవాలి.

ధనస్సు..

మనఃసౌఖ్యం ఉంది. బంధు,మిత్రుల సహకారంతో పనులు పూర్తి చేయగలుగుతారు. ధన,ధాన్య లాభాలు ఉన్నాయి. సత్యనిష్ఠతో విజయసిద్ధి ఉంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.

మకరం...

మీ మీ రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆచితూచి వ్యవహరించాలి. వినాయకుడిని ఆరాధిస్తే మంచిది.

కుంభం..

శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

మీనం..

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:ఫిబ్రవరి 1 నుంచి భక్తులకు 'పూరీ జగన్నాథుడి' దర్శనం

ABOUT THE AUTHOR

...view details