తెలంగాణ

telangana

రెండో రోజు కాంగ్రెస్​ సత్యాగ్రహ దీక్ష.. దిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్

By

Published : Jun 20, 2022, 11:49 AM IST

Slug Delhi traffic.. cong janthar manthar

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా పలు సంఘాలు.. భారత్ బంద్​కు పిలుపునివ్వడం వల్ల దిల్లీలో ట్రాఫిక్​ భారీగా స్తంభించపోయింది. వేలకొలది వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. మరోవైపు, కాంగ్రెస్​ నాయకులు రెండో రోజు.. జంతర్​మంతర్​ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. సోమవారం రాహుల్​ గాంధీ ఈడీ ముందు హాజరయ్యారు.

Delhi Traffic: త్రివిధ దళాల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్'​ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులు, యువత భారత్​బంద్​కు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర సర్కార్​.. భారీగా బలగాలను మొహరించింది. మరోవైపు.. కాంగ్రెస్​ నిరసనలు చేపట్టనున్న నేపథ్యంలో.. వాహనాలను తనిఖీలు చేస్తూ అనుమతిస్తున్నారు. దీంతో దిల్లీలో భారీగా ట్రాఫిక్​ స్తంభించిపోయింంది. ఎక్కడిక్కడే వేల కొలది వాహనాలు నిలిచిపోయాయి.

దిల్లీలో భారీగా ట్రాఫిక్​
భారీగా నిలిచిన వాహనాలు

దిల్లీ నోయిడా ఫ్లైవే, మీరట్​ ఎక్స్​ప్రెస్​వే, ఆనంద్​ విహార్​, ప్రగతిమైదాన్​తో పాటు పలు ప్రాంతాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో కొంతమంది ప్రయాణికులు తమ కష్టాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయామని, ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ట్రాఫిక్ సజావుగా సాగేందుకు తమ బృందాలను వివిధ ప్రాంతాల్లో మోహరించినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

Congress Satyagraha: సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన 'అగ్నిపథ్'​ పథకాన్ని ఉపసంహరించుకోవాలని యువత, విపక్ష పార్టీలు డిమాండ్​ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆందోళనలు చేస్తున్న యువతకు సంఘీభావం తెలపటం, రాహుల్​ గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద రెండో రోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టింది కాంగ్రెస్. ఆ పార్టీ​ సీనియర్​ నేతలు మల్లికార్జున్​ ఖర్గే, సల్మాన్​ ఖుర్షీద్​, వి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్​ సత్యాగ్రహ దీక్ష
జంతర్​మంతర్​ వద్ద కాంగ్రెస్​ దీక్ష

Rahul Gandhi Ed: మరోవైపు, సోమవారం కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.. నేషనల్​ హెరాల్డ్​ కేసు విచారణలో భాగంగా ఈడీ ముందు హాజరయ్యారు. ఇప్పటివరకు రాహుల్ గాంధీని సుమారు 30 గంటల పాటు ఈడీ విచారించింది. ఈడీ కేంద్ర కార్యాలయంతో పాటు, కాంగ్రెస్ కార్యాలయం ముందు బారికేడ్లతో బందోబస్త్​ను ఏర్పాటు చేశారు దిల్లీ పోలీసులు.

ఇవీ చదవండి:

'భారత్​ బంద్​' పిలుపుతో భద్రత కట్టుదిట్టం.. 35 వాట్సాప్​ గ్రూప్​లు బ్యాన్​

'అగ్నిపథ్‌ ఆగేదే లేదు'.. నియామక షెడ్యూళ్లు ప్రకటించిన త్రివిధ దళాలు

ABOUT THE AUTHOR

...view details