ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Protest Against Jogi Ramesh in Gadapa Gadapa Program: సామాన్యుడిపై జోగి రమేశ్ దాష్టికం.. ఆగ్రహంతో కాన్వాయ్​ని అడ్డుకున్న గ్రామస్థులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 6, 2023, 12:22 PM IST

jogi_ramesh

Protest Against Jogi Ramesh in Gadapa Gadapa Program: గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్‌కు సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది. కృష్ణా జిల్లా పెడన మండలంలోని జింజేరు గౌడపాలెం గ్రామస్థులు మంత్రిని ఘోరావ్‌ చేశారు. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని శివాజీ అనే వ్యక్తి ఇంటికి మంత్రి వెళ్లారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని శివాజీ భార్యను అడిగి తెలుసుకున్నారు. పథకాలు అందుతున్నా టీడీపీ నాయకుల వెంట ఎందుకు వెళుతున్నారని ఆమెను మంత్రి ప్రశ్నించారు. దీనికి ఆమె బదులిస్తుండగా ఆగ్రహానికి గురైన మంత్రి ఆమె భర్తను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాలని ఎస్సైను ఆదేశించారు. మంత్రి ఆదేశాలను పాటించిన పోలీసులు ఇంట్లో కోడి పందేలు వేసే కత్తులు ఎందుకున్నాయని ప్రశ్నించి శివాజీని అదుపులోకి తీసుకున్నారు. అతడిని స్టేషన్‌కు తరలించేందుకు వాహనం ఎక్కించారు. ఇంతలో గ్రామస్థులు రహదారిపైకి వచ్చి మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. శివాజీని ఎందుకు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు శివాజీని వదిలేయడంతో గ్రామస్థులు శాంతించారు.

ABOUT THE AUTHOR

...view details