ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidwani: ఆంధ్రావనిలో పెట్రేగిపోతున్న అభినవ కీచకులు

By

Published : Jun 27, 2023, 9:19 PM IST

prathidhwani

prathidwani: 'యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః'. ఎక్కడైతే ఆడవారు ఆనందంగా జీవిస్తూ.. పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. మన సంస్కృతీ, సంప్రదాయాల్లో మహిళల ఔన్నత్యం గురించి... వారికి దక్కాల్సిన గౌరవ మర్యాదల గురించి చెప్పిన మాట ఇది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నం. ఆంధ్రావనిలో అభినవ కీచకులు కలకలం రేపుతున్నారు. మరీ ముఖ్యంగా విపక్షాల మహిళ నాయకత్వంపై వేధింపులకు అధికారపక్షం పేరు చెప్పుకుంటున్న వారే.. దీన్నొక మార్గం చేసుకున్నారన్న ఫిర్యాదులు కలవరం కలిగిస్తున్నాయి. కనీస గౌరవం మరిచి.. సోషల్‌ మీడియాలో పోస్టులు, ఫోన్లకు అసభ్యకర సందేశాలు, బెదిరింపులు రోజురోజుకీ తీవ్రతరం అవుతున్నాయి.   నిజానికి ఈ విషయంలో  వీళ్లిలా పెట్రేగిపోతూ ఉండడానికి, బరితెగించి ప్రవర్తిస్తూ ఉండడానికి వాళ్లకున్న ధైర్యం ఏమిటి?  ఒక రాజకీయ నాయకురాలు కావొచ్చు... సాధారణ మహిళే కావొచ్చు... మహిళలను తిట్టడం, వేధించడం, బెదిరించడం, ఇంత ఆషామాషీ వ్యవహారమా? చట్టం, న్యాయంలో వారికి ఉన్న రక్షణ ఇంతేనా? రాజకీయ విధానాల బట్టి దీనిలో ఏమైనా వివక్ష ఉంటుందా?  అసలు ఎందుకీ పరిస్థితి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details