ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చేనేతలకు లోకేశ్​ హామీ - 200 యూనిట్ల ఉచిత విద్యుత్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2023, 8:33 PM IST

nara_lokesh_padayatra

Nara Lokesh Padayatra in joint East Godavari districts:తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర (Nara Lokesh Yuvagalam Padayatra) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. 216వ రోజు యండ్లపల్లి జంక్షన్ నుంచి ప్రారంభమైన యాత్ర కొత్తపల్లి, ఉప్పాడ, అమీనాబాద్, మూలపేట, పొన్నాడ, శీలం వారి పాకల వరకు సాగింది. కొత్తపల్లిలో విజయదుర్గ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు లోకేశ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక నాయి బ్రాహ్మణులకు ఆదరణ పథకం ద్వారా పనిముట్లు, అలాగే హెల్త్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చారు. 

అనంతరం ఉప్పాడలో చేనేత కార్మికులు లోకేశ్‌ను కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు సహా చంద్రన్న బీమా, ఆరోగ్య బీమా అందజేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details