ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏలూరు జిల్లాలో విషాదం - అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య - కిడ్నీలు దానం చేయాలని సూసైడ్​ నోట్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 10:52 PM IST

couple suicide

Farmers Dies by Suicide in Over Deb :ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం విశ్వనాద్రిపాలెంలో విషాదం నెలకొంది. రొయ్యల చెరువులు సాగు చేసి అందులో నష్టం రావడంతో పరసా నాగబాబు(30), అనూష(28) దంపతులు లేఖ రాసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆక్వా సాగులో నష్టపోవడం, అప్పులు తీర్చే అవకాశం లేకపోవడంతో ఉరి వేసుకుని చనిపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. వీరికి ఆరు సంవత్సరాల బాబు, ఐదేళ్ల బాలిక ఉన్నారు. తమ చావుకు ఎవరూ బాధ్యులు కారని, అప్పుల బాధలతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మరణానంతరం తమ కిడ్నీలు ఎవరికైనా దానం చేయాలని లేఖలో పేర్కొన్నారు.

పొలంలో ఏదో ఒక పంట వేస్తే కుటుంబ ఆదాయం పెరుగుతుందనే ఆశతో రైతులు పంటలు సాగు చేస్తుంటారు. తమ కష్టం బిడ్డలకు రాకూడదని గొడ్డు చాకిరి చేస్తుంటారు. ఎంతో కొంత సంపాదించిన సొమ్ముతోపాటు వ్యాపారులు, భూయజమానుల నుంచి అప్పు తీసుకుని పొలంపై పెడుతుంటారు. కానీ చివరికు వర్షాలు, వరదలు, తెగుళ్లతో దిగుబడులు రాక పంట దెబ్బతిని నష్టపోతున్నారు. అప్పుల ఊబిలోకి చేరుతున్నారు. కొందరు అప్పులు తీర్చే దారి కన్పించక బలవన్మరణాలకు పాల్పడుతున్న సంఘటనలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details