ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Cine personalities on Bhuvaneshwari Yatra నిజం గెలుస్తుంది..! చంద్రబాబు అక్రమ అరెస్టుపై భువనేశ్వరీ పోరాటం శ్లాఘనీయమన్న సినీ ప్రముఖులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2023, 7:57 PM IST

Cine personalities on Bhuvaneshwari Yatra నిజం గెలుస్తుంది..!

Cine personalities on Bhuvaneshwari Yatra టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' కార్యక్రమంపై.. ప్రముఖ దర్శక నిర్మాతలు రాఘవేంద్రరావు, అశ్వినీదత్​లు స్పందించారు. భువనేశ్వరి చేపట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూస్తుంటే.. నిజం నిజంగానే గెలుస్తుందనే నమ్మకం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజం గెలిచి ప్రజా విజయ భేరి మోగించే సమయంలో దగ్గరలోనే ఉందని వారు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తున్న వ్యతిరేక జ్వాలాలు.. ఈ అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించివేస్తాయని స్పష్టం చేశారు. 'నిజం గెలవాలి' ప్రజావ్యతిరేక అరాచకాలకు అంతిమఘట్టమని.. చంద్రబాబు విజయానికి హృదయ పూర్వక ఆహ్వానమని అన్నారు. చంద్రబాబును స్కిల్​ కేసులో సీఐడీ అరెస్టు చేసిన తర్వాత.. ఆయన అరెస్ట్‌ను తట్టుకోలేక టీడీపీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే బాధిత కుటుంబ సభ్యులను భువనేశ్వరి 'నిజం గెలవాలి' కార్యక్రమం ద్వారా పరామర్శిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details