ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పులివెందులకు సీఎం జగన్​.. కలిసేందుకు వచ్చిన ప్రజలను అడ్డుకున్న పోలీసులు

By

Published : Jul 7, 2022, 1:42 PM IST

Updated : Jul 7, 2022, 3:41 PM IST

ముఖ్యమంత్రి జగన్.. రెండు రోజుల పర్యటన కోసం వైఎస్సార్ జిల్లాకు చేరుకున్నారు. పులివెందుల ఆర్​అండ్​బీ అతిథి గృహంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో జగన్ సమావేశం నిర్వహించారు. జగన్​ను కలిసేందుకు వచ్చిన ప్రజలను పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పులివెందుల చేరుకున్న సీఎం జగన్
పులివెందుల చేరుకున్న సీఎం జగన్

CM Jagan YSR District Tour: రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి జగన్.. వైఎస్సాఆర్ జిల్లాకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి హెలికాప్టర్​లో పులివెందులకు వెళ్లారు. పులివెందల ఆర్​అండ్​బీ అతిథి గృహంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో జగన్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎంపీ అవినాశ్ రెడ్డి, పులివెందుల మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్​ ఛైర్మన్​తోపాటు కౌన్సిలర్లు, తొండూరు మండలానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

పులివెందుల, తొండూరు మండలాల నాయకులతో సీఎం జగన్ వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. రెండు మండలాల్లో పార్టీ నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై సీఎం సమీక్షించారు. పార్టీ పటిష్టత కోసం మరింత కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు జగన్​ దిశానిర్దేశం చేశారు. అనంతరం పులివెందులలోని ఏపీ కార్లలో బయో సైన్స్ టెక్​ను సీఎం ప్రారంభించారు.

పులివెందులలో ప్రజలకు చుక్కెదురు:జగన్​ను కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు అడ్డంకులు ఎదురయ్యాయి. పులివెందుల ఆర్​అండ్​బి అతిథిగృహంలో సీఎం జగన్.. నాయకులతో సమీక్ష నిర్వహిస్తున్నందున పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధవటం మండలంలో తమ భూములను కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని వృద్ధురాలు వాపోయింది. కొవిడ్​ విపత్కర పరిస్థితుల్లో పనిచేసిన ల్యాబ్ టెక్నీషియన్లకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరడానికి వచ్చామని.. అనుమతించాలని నిరుద్యోగులు వేడుకున్నారు. తనకు ఉద్యోగం రాకపోవడానికి సీఎం జగనే కారణమని జిల్లాకు చెందిన జగన్ వీరాభిమాని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు కానీ.. బాధితుల గోడు మీడియాలో వచ్చిన తర్వాత వారి అర్జీలు అధికారులు స్వీకరించడం విశేషం.

ఇవీ చూడండి

Last Updated : Jul 7, 2022, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details