ETV Bharat / state

ముక్కులో దూరిన రొయ్య.. ఎండోస్కోపీతో తొలగించిన వైద్యుడు

author img

By

Published : Jul 7, 2022, 7:53 AM IST

Shrimp in nose: చెరువులో చేపలు పడుతున్న సమయంలో ఓ వ్యక్తి ముక్కు రంధ్రంలోకి రొయ్య దూరి ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఏలూరు జిల్లా గణపవరం మండలంలో జరిగింది. ఎండోస్కోపీ చికిత్సతో వైద్యులు ఆ రొయ్యను బయటకు తీశారు.

Shrimp entered in the nose of man at eluru
ముక్కులో దూరిన రొయ్య.. ఎండోస్కోపీతో తొలగించిన వైద్యుడు

Shrimp in nose: చెరువులో పట్టుబడి చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ముక్కు రంధ్రంలోకి రొయ్య దూరి ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఏలూరు జిల్లా గణపవరం మండలంలో బుధవారం జరిగింది. ముక్కు నుంచి అది ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో బాధితుడు ఉక్కిరిబిక్కిరయ్యారు. అతడిని భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు ఎం.రామకృష్ణ పరీక్షించి ముక్కు రంధ్రాల్లో రొయ్య ముళ్లు లోపలికి గుచ్చుకున్నట్లు గుర్తించారు.

ఎండోస్కోపీ చికిత్సతో ఆ రొయ్యను బయటకు తీశారు. వైద్యుడు చాకచక్యంగా రొయ్యను బయటకు తీశారని, అప్పటికి అది బతికే ఉండటం విశేషమని వైద్య సిబ్బంది వివరించారు.

ఇవీ చూడండి:

ఏజ్ 40+... హాట్ లుక్స్​తో స్వీట్ 16 క్రేజ్

లక్షా 75 వేల కోట్లు దోచుకున్న జగన్.. ఇంటికొకరు రండి : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.