ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పరిశ్రమలన్ని పక్క రాష్ట్రాలకు తరలిపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి: చంద్రబాబు

By

Published : Dec 2, 2022, 7:56 PM IST

CBN: ముఖ్యమంత్రి వల్ల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. రాష్ట్రం కోసం పనిచేయటానికి వచ్చే వారిని ముఖ్యమంత్రి తరిమివేస్తున్నారని విమర్శించారు.

Chandra Babu
చంద్రబాబు

CHANDRA BABU NAIDU: తొమ్మిదివేల 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే అమరరాజా పరిశ్రమ తెలంగాణకు తరలిపోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటీ సీఎంను నా రాజకీయ జీవితంలో చూడలేదని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఊరికోక సైకోను తయారుచేస్తున్నారని దుయ్యబట్టారు. అమరరాజా పరిశ్రమను గత సీఎంలు ప్రోత్సహించారని చంద్రబాబు తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్​ వ్యక్తి వేరే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వెళ్లారని అన్నారు. నారాయణ విద్యాసంస్థల అధినేతనూ వేధిస్తున్నారని ఆరోపించారు. పోలవరం పూర్తి చేయాలని రాత్రి, పగలు పనిచేశానని అన్నారు. రైతులకు నీరు ఇచ్చేందుకు ఎంతో దూరదృష్టితో వ్యవహరించానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి నదిలో కలిపేశారని.. రాష్ట్ర జీవనాడి లాంటి పోలవరాన్ని పాడు చేస్తే బాధ ఉండదా అని ప్రశ్నించారు. ప్రజల ఉత్సాహం చూస్తే వెయ్యి ఏనుగుల బలం వస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. యువత భవిష్యత్తు కాపాడేందుకే వచ్చానని అన్నారు.

"ఈ రాష్ట్రం నాశనమైపోతోంది. కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. రాష్ట్రానికి ఎవరైనా పని చేస్తానని వస్తే.. ముఖ్యమంత్రి తరిమివేస్తున్నాడు. ఆక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఒక సంస్థ రాష్ట్రం నుంచి తరలిపోతా ఉంటే బాధగా ఉంది. ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి పక్క రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంటే కడుపు మండిపోతోంది."-టీడీపీ అధినేత చంద్రబాబు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details