ETV Bharat / state

నైరుతి పలకరించే వరకూ ఉక్కపోత సమస్యలు తప్పవు: వాతావరణ శాఖ - Monsoon winds to AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 27, 2024, 5:39 PM IST

South West Monsoons to AP at the Scheduled Time : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ముందు ప్రి మాన్ సూన్ వాతావరణం ఉందని, దాని ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాల రాకకు అనుకూల వాతావరణం ఉందని, రేమాల్ తుఫాను వల్ల నైరుతి రుతుపవనాల గమనానికి విఘాతం ఏర్పడలేదని వెల్లడించింది. రుతుపవనాలు అనుకున్న సమయానికి, కేరళను, ఆ తర్వాత మన రాష్ట్రానికి చేరే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

IMD
IMD (ETV Bharat)

South West Monsoons to AP at the Scheduled Time : ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కొద్దిరోజులుగా వాతావరణం చల్లబడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కపోత నుంచి కొంత వరకు ఉపశమనం లభించింది. బంగాళాఖాతంలో తుపాను ఏర్పడితే వర్షాలు కురుస్తాయని అందరూ భావించారు. కానీ ‘రెమాల్‌’ తుపాను ఉత్తర దిశగా బంగ్లాదేశ్‌, బంగాల్​ వైపు వెళ్లిపోవడంతో ఆశలు అడియాశలయ్యాయి. కాకినాడ, విజయవాడ నగరాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఈ తుఫాను ప్రభావం కనిపించలేదు. అయితే, ఈ తుఫాన్ కారణంగా నైరుతి రుతుపవనాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే అంశంపై వాతావరణశాఖ కీలక విషయాలు వెల్లడించింది.

రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు ముందు ప్రి మాన్ సూన్ వాతావరణం ఉందని ఆ ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని విశాఖ వాతావరణ శాఖా అధికారి డాక్టర్ సునంద తెలిపారు. రాష్ట్రంలో రుతుపవనాల రాకకు అనుకూల వాతావరణం ఉందని, రేమాల్ తుఫాన్ వల్ల నైరుతి పవనాల గమనానికి విఘాతం ఏర్పడ లేదని పేర్కొన్నారు. అనుకున్న సమయానికి రుతు పవనాలు కేరళను, ఆ తరువాత మన రాష్ట్రానికి తాకుతాయని వెల్లడించారు. నైరుతి పలకరించే వరకు తెలుగు రాష్ట్రాలలో ఈ ఉష్ణోగ్రతలు, ఉక్కపోత సమస్య ఉంటుందని విశాఖ వాతావరణ శాఖాధికారి డాక్టర్ సునంద తెలిపారు.

తెలంగాణలో గాలివాన బీభత్సం - 13 మంది దుర్మరణం - నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే ఏడుగురు మృతి - TELANGANA RAIN DEATHS TODAY

బంగ్లాదేశ్​పై రెమాల్ తుపాన్ ప్రభావం: బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్, బంగాల్​ సరిహద్దుల్లో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. రెమాల్ తుపాను ధాటికి బంగ్లాదేశ్​, బంగాల్​లో భారీ వర్షాలు ముంచెత్తాయి. గంటకు దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురు గాలులు వీస్తుండడం వల్ల పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగి పడడం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరాఫరా నిలిచిపోయింది. భారీ వర్షాల ధాటికి పలు చోట్ల వరదలు సంభవించాయి. దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని గోసాబాలో ఇంటి పైకప్పు కూలడం వల్ల ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ముందస్తు జాగ్రత్తగా అధికారులు దాదాపు లక్ష మందిని తీరప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీరప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉడండం వల్ల అధికారులు అప్రమత్తం అయ్యారు. సహాయక బృందాలను సిద్ధం చేశారు.

తీరం దాటిన రెమాల్- బంగాల్​లో తుపాను బీభత్సం- 135 కి.మీ వేగంతో భారీ ఈదురుగాలులు - remal cyclone update

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.