ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రతిపక్షంలో ప్రగల్భాలు - అందలమెక్కాక నోరు మెదపని వైసీపీ ఎంపీలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 12, 2023, 7:12 AM IST

YSRCP MPs Did Not Talk About AP Development In Parliament: అత్యధిక లోక్‌సభ సీట్లు గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచుతామని ప్రతిపక్షంలో ఉండగా ప్రగల్భాలు పలికారు. ప్రత్యేకహోదా తెస్తామంటూ ఊరూరా సభలు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా వైఎస్సార్సీపీ ఎంపీలను అందలమెక్కిస్తే విభజన హామీలపై పోరాడటం కాదు కదా.. కనీసం కేంద్ర మంత్రులను మాటవరసకైనా అడిగిన పాపానపోలేదు. విశాఖకు రైల్వేజోన్ తీసుకురాకపోగా ఉన్న ఉక్కు కర్మాగారాన్ని కాపాడలేకపోయారు. మెట్రో ప్రాజెక్ట్‌లు, జాతీయ విద్యా సంస్థలు ఏవీ పూర్తికాకపోయినా వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రాన్ని కనీసం ప్రశ్నించలేకపోతున్నారు.

YSRCP_MPs_Did_Not_Talk_About_AP_Development_In_Parliament
YSRCP_MPs_Did_Not_Talk_About_AP_Development_In_Parliament

ప్రతిపక్షంలో ప్రగల్భాలు - అందలమెక్కాక నోరు మెదపని వైసీపీ ఎంపీలు

YSRCP MPs Did Not Talk About AP Development In Parliament :లోక్‌సభ సీట్ల పరంగా దేశంలోనే ఐదో అతిపెద్ద పార్టీగా అవతరించినా రాష్ట్ర ప్రయోజనాలను కాపడటంలో వైఎస్సార్సీపీ ఎంపీలు (YSRCP MPs) పార్లమెంట్‌ లోపల కానీ, బయట కానీ కేంద్రాన్ని నిలదీయడం దేవుడెరుగు.. కనీసం ప్రశ్నించిన పాపాన పోలేదు. NDA మిత్రపక్షాల కన్నా ముందుగానే కేంద్రం పెట్టే బిల్లులన్నింటికీ బేషరతుగా మద్దతివ్వడం.. బీజేపీ ఎంపీ (BJP MP)ల కన్నా ఎక్కువగా ప్రతిపక్షాలపై విరుచుకుపడటం వైఎస్సార్సీపీ ఎంపీలకు అలవాటైపోయింది. విభజన హామీల (Bifurcation Assurances) సాధనపై ఏమాత్రం చొరవ చూపడం లేదు.

MP Vijaya Sai Reddy Silent in Andhra Pradesh Development :వైఎస్సార్సీపీ ఎంపీలు విశాఖ రైల్వేజోన్‌ (Visakha Railway Zone), మెట్రో ప్రాజెక్ట్‌ (Metro Project) పనులపై కేంద్రాన్ని ఒప్పించలేకపోయారు. కీలక ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya Sai Reddy) ఏనాడూ తన పరపతిని రైల్వేజోన్ సాధన కోసం వినియోగించలేకపోయారు. పైగా విశాఖ ఉక్కు కర్మాగారం (Visakha Steel Plant) అమ్మకానికి పెట్టినా నోరు మెదపడం లేదు. కనీసం కార్మికులకు వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దతు కూడా తెలపలేదు. ఈ నాలుగేళ్లలో విశాఖ మెట్రో ఒక్కటంటే ఒక్క అడుగూ ముందుకు పడలేదు. గత ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్‌ను మార్చి కొత్తది చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వం వద్దే మూలుగుతోంది.

రైల్వే జోన్​ సాధించలేని వైసీపీ ఎంపీలు : రాజధాని అమరావతి మీదుగా పెర్రుపాలెం-అమరావతి-నంబూరు డబుల్‌ లైన్, అమరావతి-పెదకూరపాడు, సత్తెనపల్లి-నరసరావుపేట మధ్య కొత్తగా సింగిల్‌ లైను కలిపి 106 కి.మీ. మేర నిర్మాణానికి 2,679 కోట్లతో DPR పూర్తయినా ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్‌ సాధించలేకపోయారు. కడప-బెంగళూరు మధ్య 268 కి.మీ. ప్రాజెక్టు 2,849 కోట్లతో చేపట్టినా పనులు సాగడం లేదు. నడికుడి-శ్రీకాళహస్తి మధ్య 2,700 కోట్లతో 309 కి.మీ. లైన్‌దీ అదే గతి. 2,125 కోట్లతో 57 కి.మీ. మేర ప్రతిపాదించిన కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌ పనులకూ దిక్కులేదు. రాయదుర్గం-తుముకూరు లైన్‌లో మన రాష్ట్ర పరిధిలో మిగిలిపోయిన కేవలం 30 కి.మీ. పనులనూ పూర్తి చేయించలేదు.

కేంద్రం మరోసారి మొండిచెయ్యి.. ఆ రైల్వే ప్రాజెక్టులకు నిధులేవి

YSRCP MPs on National Highway Project :రాష్ట్రానికి జాతీయ రహదారుల ప్రాజెక్టులను వైఎస్సార్సీపీ ఎంపీలు సాధించలేకపోయారు. అనంతపురం-అమరావతి మధ్య 384 కి.మీ. మేర ఎక్స్‌ప్రెస్‌వేకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపినా ఆ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పడేసింది. దీనికి బదులుగా సత్యసాయి జిల్లా కోడూరు నుంచి పులివెందుల నియోజకవర్గం మీదుగా ప్రకాశం జిల్లా మేదరమెట్ల వరకు కొత్త రహదారి ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అమరావతికి కేంద్రం మంజూరు చేసిన ఓఆర్‌ఆర్‌ పనులను ముందుకు సాగనివ్వకుండా చేసి దాని స్థానంలో విజయవాడకు తూర్పు వైపు బైపాస్‌ను ప్రతిపాదించింది.

విభజన హామీల సాధన కోసం చొరవ చూపని వైసీపీ ఎంపీలు :విభజన చట్టంలో ప్రతిపాధించిన విద్యా సంస్థలను ఎంపీలు సాధించలేకపోయారు. ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన ఉర్దూ వర్సిటీకి 8 ఏళ్లవుతున్నా శాశ్వత చిరునామా దక్కలేదు. ఇప్పటికీ అద్దె భవనంలోనే కొనసాగుతోంది. గుంటూరులో ఏర్పాటు చేసిన వ్యవసాయ వర్సిటీ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో గతేడాది నుంచి పీజీ తరగతులు 2022 నుంచి పీజీ తరగతులను బాపట్ల, తిరుపతిల్లోని కళాశాలల్లో నిర్వహిస్తున్న దుస్థితి. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇంకా JNTU (Jawaharlal Nehru Technological University)కు చెందిన భవనాల్లో నిర్వహిస్తున్నారు.

'మేము రాజీనామాలు చేస్తే... ఏపీకి ప్రత్యేక హోదా రాదు'

YSRCP Government on Bifurcation Assurances :గత ప్రభుత్వం హయాంలో జంతలూరులో 490 ఎకరాలను కేటాయించి ప్రహరీ నిర్మాణానికి నిధులూ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ పనులను చేపట్టలేదు. తిరుపతిలో ఏర్పాటు చేసిన IISER (Indian Institutes of Science Education and Research) ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. విజయనగరం జిల్లా రెల్లిలో గత ప్రభుత్వం గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయడమేగాక స్థల సేకరణ పూర్తి చేసి ప్రహరీ నిర్మించారు. కానీ, వైఎస్సార్సీపీ దాన్ని సాలూరు నియోజకవర్గ పరిధిలోకి మార్చింది. చినమాడపల్లి, మర్రివలస గ్రామాల్లో 561 ఎకరాల భూమిని కేటాయించింది.కానీ దీనికి రోడ్డు నిర్మించలేదు మొత్తమ్మీద వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత ఈ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన మాత్రం చేశారు. ఇప్పటికీ పనులు మొదలవలేదు.

YSRCP MPs Silent in In Parliament :తిరుపతి, గన్నవరం విమానాశ్రయాలు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్న హామీ మాటలకే పరిమితమైంది. రేణిగుంటలో రన్‌వేను పొడిగించినా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అక్కడి నుంచి అంతర్జాతీయస్థాయి విమానాలు నడిపే ప్రయత్నాన్ని ఎంపీలు చేయడం లేదు. గన్నవరం విమానాశ్రయానికి కేంద్రం 2017లో అంతర్జాతీయ హోదాను ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవన నిర్మాణం చేపట్టారు. ఒకేసారి 400 మంది విదేశీ, 800 మంది దేశీ ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి వీలుపడే ఈ టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకొస్తేనే.. విదేశీ విమానయాన సంస్థలు ఇటువైపు దృష్టి సారిస్తాయి. గతేడాది డిసెంబరుకే ఇవి పూర్తి కావాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ 60 శాతం కూడా పూర్తి కాలేదు. దీంతో గత తెదేపా హయాంలో ఇక్కడ 3,523 అడుగుల మేర విస్తరించిన రన్‌ వేను ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా పోతోంది.

'ప్రత్యేక హోదా పక్కన పెట్టి.. కేసుల మాఫీకి వైకాపా బిజీ'

TAGGED:

ABOUT THE AUTHOR

...view details