ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి: జనసేన

By

Published : Dec 20, 2022, 9:32 PM IST

Janasena Warning: విశాఖ జనసేన నాయకులు వైసీపీ మంత్రులను హెచ్చరించారు. మంత్రులు అంబటి రాంబాబు, రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారులు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని హితవు పలికారు.

janasena leaders
జనసేన నాయకులు

Janasena Warning: జనసేన అధినేత పవన్ కళ్యాణ్​పై వైసీపీ మంత్రులు నోరు పారేసుకోవడం మంచి పద్ధతి కాదని విశాఖపట్నం జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజా వారాహి వాహనం మీద విమర్శలు చేయడాన్ని ఖండించారు. మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారులు వైసీపీ పార్టీకి పని చేయడం మానుకుని.. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు.

మంత్రులను హెచ్చరించిన జనసేన నాయకులు

"సజ్జల రామకృష్ణారెడ్డిగారు.. మీరు పెద్ద సలహాదారు కదా. మీ ముఖ్యమంత్రికి మీతో పాటు 54 మంది సలహాదారులుగా ఉన్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి కౌలు రైతులను ఆదుకోలేరా. జనసేన ప్రచార రథం వారాహిని చూస్తుంటే మీకు నిద్ర పట్టడం లేదు". - కొన తాతారావు, జనసేన పీఏసీ సభ్యుడు

"ఊసరవెల్లి రంగులు మార్చినట్టు.. పార్టీలు మార్చే పర్యాటక శాఖా మంత్రి రోజాకి పవన్ కల్యాణ్​ని విమర్శించే స్థాయి ఉందా అని అడుగుతున్నాం".- పసుపులేటి ఉషకిరణ్ , జనసేన రాష్ట్ర నాయకురాలు

"గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రైతులకు డబ్బులు ఇచ్చినప్పుడు కడుపు మంటతో అంబటి రాంబాబు, రోజా, జోగి రమేష్ మాట్లాడిన మాటలను ఖండిస్తున్నాం". - కె ఎస్ రాజు, జనసేన రాష్ట్ర నాయకులు

"సాంకేతిక సమస్యల వలన కౌలు రైతులను గుర్తించలేకపోయాం అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అసలు వైసీపీ గెలవడమే ఒక సాంకేతిక సమస్య. సలహాదారులు తీసుకుంటున్న లక్షల రూపాయల జీతం ప్రజల కష్టార్జితం. రాష్ట్రంలో పుడుతున్న ప్రతీ బిడ్డ లక్షన్నర అప్పుతో పుడుతున్నారు". - పంచకర్ల సందీప్ , జనసేన రాష్ట్ర నాయకుడు

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details