ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్​ పర్యటన..

By

Published : Nov 22, 2022, 3:37 PM IST

Updated : Nov 23, 2022, 6:23 AM IST

CM JAGAN TOUR

CM JAGAN TOUR : సీఎం పర్యటన అంటేనే రాష్ట్ర ప్రజల గుండెల్లో గుబులు పుడుతోంది. రెండు రోజుల ముందు నుంచే పోలీసులు సదరు పట్టణాన్ని చేతుల్లోకి తీసుకుని దిగ్బంధనం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సభా ప్రాంగణానికి రెండు కిలోమీటర్ల మేర నుంచే రోడ్డుకిరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బుధవారం సీఎఁ జగన్​ పర్యటన దృష్ట్యా అక్కడ కూడా ఇదే పరిస్థితి.

ముఖ్యమంత్రి జగన్‌ నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్న సీఎం.. 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం... లబ్ధిదారులకు రీసర్వే పత్రాలు పంపిణీ చేస్తారు. 2020 డిసెంబర్‌ 21న వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు 47 వేల 276 చదరపు కిలోమీటర్ల పరిధిలోని.... 6 వేల 819 గ్రామాల్లో డ్రోన్‌ ఫ్లయింగ్‌ పూర్తిచేసింది.

2 వేల గ్రామాల్లో రీసర్వే కార్యకలాపాలు పూర్తవగా... 18 వందల 35 గ్రామాల్లో 7 లక్షల 29 వేల 381 మంది రైతుల భూహక్కు పత్రాలను తయారుచేశారు. వచ్చే 15 రోజుల్లో 2 వేల గ్రామాలకు సంబంధించిన రైతులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ 2 వేల గ్రామాల రిజిస్ట్రేషన్ సేవలను గ్రామ సచివాలయాల్లో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో.. భూపత్రాల పంపిణీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

సీఎం పర్యటన సందర్భంగా నరసన్నపేటను అష్టదిగ్బంధనం చేశారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సభా వేదిక కోసం జూనియర్ కళాశాల మైదానంలో రెండు చోట్ల ప్రహరీతోపాటు చెట్లను కూల్చివేశారు. అధికారుల నిర్వాకంతో డిగ్రీ పరీక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడ్డారు. కళాశాల రోడ్డులో దుకాణాలు మూసివేశారు. కూరగాయల దుకాణాలను అక్కడి నుంచి తరలించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినప్పుడూ ఈ స్థాయిలో ప్రజలను ఇబ్బంది పెట్టలేదంటూ... పోలీసు ఆంక్షలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 23, 2022, 6:23 AM IST

ABOUT THE AUTHOR

...view details