సీఎం జగన్​కు పవన్​కల్యాణ్​ స్ట్రాంగ్​ కౌంటర్​.. ఏమన్నారంటే?

author img

By

Published : Nov 22, 2022, 1:49 PM IST

pawan kalyan

Pawan Fires On CM Jagan : జనసేనపై ముఖ్యమంత్రి జగన్​ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ అధినేత పవన్​ తీవ్రంగా ఖండించారు. జగన్​ వ్యాఖ్యలకు కౌంటర్​గా ఓ కార్టూన్​ను ట్వీట్టర్​లో పోస్టు చేశారు. ఇంతకీ ఆ ట్వీట్​లో ఏముందంటే?

Pawan Tweet On YCP Government : ముఖ్యమంత్రి జగన్​పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేనపై సీఎం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఓ కార్టూన్‌ను ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలను వైకాపా నేతలు ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఆ కార్టూన్​లో వివరించారు. వైకాపా ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకోవడంపై చిత్రంలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పాటుపడుతుంటే.. తమ పార్టీని రౌడీసేన అని ముఖ్యమంత్రి ఎలా వ్యాఖ్యానిస్తారంటూ అర్థం వచ్చేలా కార్టూన్​ని పోస్టు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.