ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nadu Nedu Funds Drawn with Forgery Signatures ఫోర్జరీ సంతకాలతో నాడు నేడు నిధులను స్వాహా ..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2023, 5:46 PM IST

Nadu Nedu Funds Drawn with Forgery Signatures: నాడు నేడు పనులకు మంజూరైన నిధులను ఫోర్జరీ సంతకాలతో స్వాహా చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. ఇన్​ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలే అంతా చేశారని ఆరోపిస్తూ.. ఇంజనీరింగ్ అసిస్టెంట్, తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షురాలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Nadu Nedu Funds Drawn with Forgery Signatures
Nadu Nedu Funds Drawn with Forgery Signatures

Nadu Nedu Funds Drawn with Forgery Signatures: ఫోర్జరీ సంతకాలతో నాడు నేడు పనులకు (Nadu Nedu Works) మంజూరైన నిధులను ఇన్​ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయురాలు డ్రా చేసుకుని స్వాహా చేశారంటూ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, సీఆర్‌పీ, కమిటీ సభ్యులు చేసిన ఆరోపణలు వెలుగు చూశాయి. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం బాలసముద్రం పంచాయతీ పరిధిలోని నల్లగుట్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాడు నేడు రెండో విడత పనులు చేశారు.

పనులకు సంబంధించిన 4 లక్షల 9 వేల రూపాయలను ఇన్​ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు నివేదిత ఫోర్జరీ సంతకాలతో డ్రా చేశారు. పాఠశాలలో సమావేశమై తీర్మాన ప్రతి రాయకుండానే ఇంజనీరింగ్ అసిస్టెంట్ సుభాష్ చంద్రబోస్, తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షురాలు ఈశ్వరమ్మ సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేసిన ప్రధానోపాధ్యాయురాలు నివేదిన ఆ సొమ్మును వాడుకున్నారు.

Nadu-Nedu: 'వైసీపీ ప్రభుత్వ ప్రచారాల కోసమే నాడు-నేడు'.. పాఠశాలలు ప్రారంభమైనా.. పూర్తికాని పనులు

ఇలా బయటపడింది..: జులై 5వ తేదీన రెగ్యులర్ ప్రధానోపాధ్యాయుడుగా శ్రీధర్ రెడ్డి విధుల్లో చేరారు. బాధ్యతలు అప్పగించాలని ఆయన ఇన్​ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు నివేదితను కోరారు. ఆమె వాయిదాలు వేస్తూ ఉండటంతో అనుమానం కలిగిన శ్రీధర్ రెడ్డి పాఠశాలకు సంబంధించిన నాడు - నేడు పైనులపై ఆరా తీసి బ్యాంకు ఖాతా స్టేట్​మెంట్స్​ని తీయగా విషయం బయటపడింది. జూన్, జులై నెలలలో విడతల వారీగా 4 లక్షల 9 వేల రూపాయలు డ్రా అయినట్లు గుర్తించారు.

మొత్తంగా అయిదు సార్లు డ్రా చేసినట్లు.. అందులో మూడు సార్లు సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ సుభాస్‌ చంద్రబోస్‌, రెండు సార్లు సీఆర్‌పీ వెంకటనారాయణ సంతకాలు ఫోర్జరీ చేసినట్లు తెలిసింది. జూన్‌ 12వ తేదీన రూ.30 వేలు, 15వ తేదీన రూ.80 వేలు, జులై 18వ తేదీన రూ.1.20 లక్షలు, ఆగస్టు 13వ తేదీన రూ.59 వేలు, 24వ తేదీన రూ.1.20 లక్షలు మొత్తంగా 4 లక్షల 9 వేల రూపాయలు కొక్కంటిక్రాస్‌లోని యూనియన్‌ బ్యాంకులో డ్రా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

Nadu-Nedu Scheme: పడకేసిన నాడు నేడు అభివృద్ధి పనులు

గుట్టుగా సాగిన విచారణ: దీంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎంపీడీవో నరసింహులు, స్థానిక మండల విద్యాధికారి కల్యాణి.. దీనిపై గుట్టుగా విచారణ చేసి డీఈఓకు విషయం తెలిపారు. స్కూల్ ప్రారంభం నుంచి నివేదిత ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయినిగా ఉన్నారు. బ్యాంకు నుంచి ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా అయినట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో ఓబులదేవరచెరువు మండల విద్యాధికారి రమణను విచారణకు పంపారు.

ప్రధానోపాధ్యాయురాలిపై ఫిర్యాదు: ఇన్​ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసిన నివేదిత, తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్ ఈశ్వరమ్మ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సుభాష్ చంద్రబోస్, సీఆర్​పీల నుంచి విచారణ అధికారి రమణ వివరాలు సేకరించారు. ఫోర్జరీ సంతకాలతో డబ్బు డ్రా చేసిన ప్రధానోపాధ్యాయురాలు నివేదితపై ఇంజనీరింగ్ అసిస్టెంట్, కమిటీ ఛైౖర్‌పర్సన్‌ ఈశ్వరమ్మ, సీఆర్​పీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

NO CLASS ROOMS: నాడు-నేడు పనుల్లో జాప్యం.. చెట్ల కిందే చదువు

అదే విధంగా సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ సుభాష్‌చంద్రబోస్‌, తాను బదిలీపై వెళ్లిన తరువాత కూడా చెక్కు డ్రా చేశారని సీఆర్‌పీ వెంకటనారాయణ రాతపూర్వకంగా అందజేశారు. ఫోర్జరీ సంతకాలకు సంబంధించిన విచారణపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని మండల విద్యాధికారి రమణ తెలిపారు. మరోవైపు నిధులను స్వాహా చేసేందుకే నాడు నేడుని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Nadu Nedu Works Not Complited: నిధులు విడుదల చేయని ప్రభుత్వం.. ఆగిన నాడు - నేడు పనులు

ABOUT THE AUTHOR

...view details