ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీట్ల మార్పుపై వైఎస్సార్సీపీ నాయకుల ఆగ్రహం - కార్యకర్తలను కరివేపాకులా తీసివేస్తున్నారని అసహనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 8:48 AM IST

Updated : Dec 20, 2023, 1:26 PM IST

YSRCP Changes Constituency Incharge: అధికార వైఎస్సార్సీపీలో సీట్ల మార్పుపై ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. అధిష్ఠానం కనీసం తమను సంప్రదించకుండా ఇష్టానుసారం స్థానచలనాలు చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తాం కానీ వచ్చేవారితో తమ సంబంధాలు ఎలా ఉండబోతాయో ఎవరు స్పష్టత ఇస్తారనిఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

YSRCP_Changes_Constituency_Incharge
YSRCP_Changes_Constituency_Incharge

వైఎస్సార్సీపీ సీట్ల మార్పుపై ద్వితీయ శ్రేణి నాయకులు ఆగ్రహం - కార్యకర్తలను కరివేపాకులా తీసివేస్తున్నారని అసహనం

YSRCP Changes Constituency Incharge :కార్యకర్తలా? కరివేపాకులా? ఎన్నికలొస్తే చొక్కాలు చింపుకొని తమ అభ్యర్థిని గెలిపించుకోడానికి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు పని చేస్తారు. పార్టీమీద అభిమానమొక్కటే కాదు. అభ్యర్థితో ఉన్న సంబంధాలు కూడా ఈ చిత్తశుద్దికి కారణమవుతుంది. అయితే వైఎస్సార్సీపీలో అంతా నేనే మాటే ఫైనల్‌ నేను మోనార్క్‌ని అనే విధంగా జగన్ మోహన్‌ రెడ్డి సింగిల్‌ మేన్‌ ఆర్మీలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల పలు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీల మార్పుతరువాత ఆయా నియోజక వర్గాల్లో ఉన్న ద్వితీయ, తృతీయ, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు ఒకింత అసహనానికి, అసంతృప్తికి గురవుతున్నారు. పార్టీ మాటకు గౌరవం ఇస్తాం. కానీ వచ్చేవారితో మా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయో ఎవరు స్పష్టత ఇస్తారు? భవిష్యత్తులో ఏదైనా జరిగితే కొత్తగా తయారయిన నాయకుడు అండగా నిలబడతాడనే గ్యారంటీ ఉంటుందా? అనే ప్రశ్నలు లేవనెత్తున్నారు.

Prakasam District YSRCP Leaders Fire on CM Jagan :వైఎస్సార్సీపీ అధిష్ఠానం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జీలను మార్పు చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో విజయవకాశాలు సన్నగిల్లడంతో వేరే నియోజకవర్గాలకు స్థానచలం చేస్తూ పార్టీ నిర్ణయించింది. అధిష్ఠాన హఠాత్తు నిర్ణయంపై ఇన్‌ఛార్జీలే కాకుండా, వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమతో ఎలాంటి సంబంధాలు లేని కొత్త వ్యక్తి వస్తే ఎలా అంటూ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమ అభిప్రాయాలు తీసుకోకుండా స్థానిక రాజకీయ పరిస్థితులపై కనీసం చర్చించకుండా నిర్ణయాన్ని ప్రకటించడంపై అసహనానికి గురవుతున్నారు.

వైసీపీ ఇంచార్జ్​లు నియామకం - మార్పుల వెనుక డబ్బు-లాబీయింగ్‌ గట్టిగా పని చేసిందని ప్రచారం

YSRCP Changing Sitting MLAs For 2024 Election : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గానికి హనిమిరెడ్డి పేరు ప్రకటనపై స్థానిక ద్వితీయ నేతలు విస్మయానికి గురయ్యారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే సుధాకరబాబుకు బదులు మంత్రి మేరుగ నాగార్జున పేరు ప్రకటించారు. ఈ ప్రకటనపైనా నియోజకవర్గ ద్వీతీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సుధాకర బాబుతో వీరంతా కొంత ఇబ్బంది పడ్డారు. నాయకులను పట్టించుకోకపోవడం, అవినీతి పెరిగిపోవడం వల్ల నియోజకవర్గంలో అన్ని స్థాయిల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పిన వ్యక్తికి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

వైఎస్సార్​సీపీ నూతన ఇన్​చార్జ్​లు నియామకం - నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కార్యకర్తల హుకుం

2024 Election in Andhra Pradesh :రాష్ట్ర మంత్రి ఆదిములపు సురేష్ ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కొండెపి నియోజకవర్గంకు నియమించడంతో ఇక్కడ కూడా వైఎస్సార్సీపీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నారు. ఎర్రగొండపాలెంలో కార్యకర్తలకు, నాయకులతో సరైన సంబంధాలు కొనసాగించేవారు కాదని, అక్కడ పరిస్థితులు బాగోలేకనే ఇక్కడకు పంపిస్తున్నారని, ఇక్కడ కూడా అదే సంబంధాలు కొనసాగిస్తే, తమ పరిస్థితి ఏమటని? కొండెపి వైఎస్సార్సీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఈ అంశంపై ఇక్కడ కూడా త్వరలో సమావేశం ఏర్పాటు చేసుకొని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు సిద్దం అవుతున్నారు. అధిష్టాన వర్గం నుంచి గానీ, ఆ స్థాయి నాయకులుగానీ తమతో సంప్రదించి, కొత్త అభ్యర్థి ప్రకటించి ఉంటే తమకు గౌరవం ఇచ్చినట్లు ఉండేదని వీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్సీపీలో వన్‌మ్యాన్‌ షో! అంతా అహం బ్రహ్మాస్మి, తెరపై దింపుడు కళ్లం ప్రయత్నాలు

Last Updated : Dec 20, 2023, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details