ETV Bharat / state

వైఎస్సార్సీపీ నేతల గుప్పిట్లో సిలికా - క్వార్ట్జ్‌ వ్యాపారం - తనిఖీల పేరిట వందల కోట్లలో దోపిడీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 9:34 AM IST

YSRCP Leaders Attack on Mining Leaseholders: తవ్వాలన్నా కప్పం కట్టాలి. తరలించాలన్నా అంతే. టన్నుకు 7 వేలు చొప్పున కట్టాల్సిందే. ధిక్కరిస్తే కేజీ క్వా ర్ట్జ్‌ రాయిని కూడా తీసుకెళ్లలేరు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం ఇవీ నెల్లూరు జిల్లా గనులు వ్యాపారులకు ఎదురువుతున్న హెచ్చరికలు. జిల్లాలో గనులు వ్యాపారంపై అధికార పార్టీ గుత్తాధిపత్యం నడుస్తోంది. అడ్డగోలుగా వైఎస్సార్సీపీ నేతలు దోపిడీకి తెగబడుతున్నారని, ఖనిజాన్ని బట్టి రేటుని నిర్ణయిస్తూ, వసూళ్లకు దిగుతున్నారని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఏం జరుగుతుందని అడిగితే మరో మాట లేకుండా వైఎస్సార్సీపీ నేతల వసూళ్లు అని గనులు వ్యాపారులు చెబుతున్నారు. దీన్నిబట్టే వైఎస్సార్సీపీ పెద్దలు వసూళ్లకు గద్దల్లా ఎలా వాలిపోతున్నారో స్పష్టమవుతోంది.

YSRCP_Leaders_Attack_on_Mining_Leaseholders
YSRCP_Leaders_Attack_on_Mining_Leaseholders

వైఎస్సార్సీపీ నేతల గుప్పిట్లో సిలికా- క్వార్ట్జ్‌ వ్యాపారం-తనిఖీల పేరిట వందల కోట్లలో దోపిడీ

YSRCP Leaders Attack on Mining Leaseholders : ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ మార్క్‌ మైనింగ్‌ దందా సాగుతోంది. సిలికా శాండ్, క్వా ర్ట్జ్‌ ఖనిజాలకు సంబంధించి మైనింగ్‌ లీజుదారులని వైఎస్సార్సీపీ నేతలు భయపెడుతూ వసూళ్లకు దిగుతున్నారు. అధికార పార్టీ మద్దతుదారులమని చెప్పుకొంటూ బలవంతంగా సొమ్ము డిమాండ్‌ చేస్తున్నారు. ఇవ్వమంటే క్వారీల్లో తవ్వకాలు చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు. మండలాల వారీగా వసూళ్ల దందా కొనసాగుతోంది. ప్రతి నెలా కోట్ల రూపాయలు వసూలు చేస్తూ కొంత వాళ్లు తీసుకొని, అధికశాతం పెద్దలకు చేరవేస్తున్నారు.

Mining Leaseholders Silica and Quartz Business Under Ruling Party Leaders : సైదాపురం, గూడూరు, పొదలకూరు మండలాల్లో మంచి నాణ్యత ఉన్న మైకాతో కూడిన క్వార్ట్జ్‌ లభిస్తుంది. లీజుల్లో లభించేదాని కన్నా ప్రభుత్వ, అటవీ, అసైన్డ్‌ భూముల్లో లభించే ఖనిజాన్నే వ్యాపారులు తవ్వి తరలిస్తున్నారు. చైనాలో దీనికి బాగా డిమాండ్‌ ఉన్నందున ధర పెరిగిపోయింది. దీంతో వైఎస్సార్సీపీ నేతలు రంగంలోకి దిగారు. ఎండీఎల్స్‌కు పర్మిట్లు జారీకాకుండా ఆన్‌లైన్‌లో బ్లాక్‌ చేయించారు. ఆ తర్వాత వ్యాపారులతో ఓ వైఎస్సార్సీపీ నేత గూడూరులోని ఒక హోటల్‌లో మంతనాలు జరిపాడు. టన్నుకు 2 నుంచి 3 రూపాయలు చొప్పున చెల్లిస్తేనే బ్లాక్‌ అయిన ఎండీఎల్స్‌కు పర్మిట్లు జారీ అవుతాయని స్పష్టం చేశాడు. దీనికి కొందరే సమ్మతించారు. దీనిపై రచ్చ జరగడంతో సదరు నేత కాస్త వెనక్కి తగ్గారు. తాజాగా రెండు నెలలుగా కీలక వైఎస్సార్సీపీ నేతలు మళ్లీ రంగ ప్రవేశం చేశారు.

YSRCP Leaders Running Silica Sand Business in AP: చేతులు మారిన సిలికా దందా.. నేరుగా వైసీపీ చేతుల్లోకే..

అస్త్రంలా గనుల శాఖ అధికారులు : వైఎస్సార్సీపీ నేతలు నిర్ణయించిన ధరల ప్రకారం మారుమాట్లాడకుండా లీజుదారులు ముట్టజెప్పాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇటీవల ఏ లీజుదారుడైనా, ఎండీఎల్‌ యజమానైనా టన్ను క్వార్ట్జ్‌ తరలించాలంటే తమకు 7 వేలు చెల్లించాల్సిందేనని అందరికీ హెచ్చరికలు జారీ చేశారు. ఇలా సొమ్ము చెల్లించేవారి ఎండీఎల్స్‌ మాత్రమే తెరుచుకునేలా చూస్తున్నారు. ఇందుకు గనుల శాఖ అధికారులను అస్త్రంగా వాడుకుంటున్నారు. క్వార్ట్జ్‌ చేరేలా, అక్కడి నుంచి బయ్యర్లకు రవాణా అయ్యేలా అనుమతిస్తున్నారు. టన్నుకు 7 వేలు చొప్పున వసూలు చేసిన సొమ్ములో 2 వేలు వరకు ఉంచుకొని.. మిగిలిన మొత్తాన్ని పార్టీ కీలక నేతకు, ఓ పెద్దాయన కుమారుడికి, పులివెందుల ముఖ్య నేత కుటుంబీకునికి చేరవేస్తున్నారు.

వైఎస్సార్సీపీ కనుసన్నల్లో దందా : పొదలకూరు మండలంలో వసూళ్ల వ్యవహారాన్ని ప్రతిపక్షాలపై తీవ్రవిమర్శలతో విరుచుకుపడే ఓ అమాత్యుడి తరఫున ఇటీవల ఓ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వైఎస్సార్సీపీ నేత ఒకరు చూస్తున్నారు. కొంతకాలం కిందటి వరకు మంత్రివర్గంలో కొనసాగి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నేత గూడూరు మండలాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్నారు. సైదాపురం మండలంలో దందాను వైఎస్సార్సీపీకు ఓ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ, ఓ రాష్ట్ర స్థాయి సొసైటీ అధ్యక్షుడిగానూ ఉన్న నేత చూసుకుంటున్నారు.

అనుమతులు, కోర్టు స్టేలతో వైఎస్సార్సీపీ నేతులు పట్టించుకోరు : అధికార పార్టీ నేతలకు కప్పం కడుతున్న వాళ్లుసైదాపురం, గూడూరు, పొదలకూరు మండలాల్లో ఎక్కడికక్కడ ఇష్టమొచ్చినట్లు క్వార్ట్జ్‌ తవ్వుతున్నారు. దాదాపు నెలకు 50 నుంచి 60 వేల టన్నులకుపైగా ఖనిజాన్ని తరలిస్తున్నారు. ఓ అమాత్యుడి సొంతూరికి పక్కనే తాటిపర్తిలో రుస్తుం మైన్స్, మరుపూరులో శక్తి మైన్స్‌ లీజుల గడువు ముగిసింది. అందులో రుస్తుం మైన్స్‌ రెన్యువల్‌కు చాలా రోజుల క్రితమే ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. అనుమతులు పెండింగ్‌లో ఉండగానే సంబంధిత గనుల్లో వైఎస్సార్సీపీ నేతల అనుయాయులు పెద్ద ఎత్తున మైనింగ్‌ చేసేస్తున్నారు. ఇదేం అన్యాయమంటూ రుస్తుం మైన్స్‌ యజమాని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చినా ఖాతరు చేసేవారే లేరు. మూడు మండలాల పరిధిలో దాదాపు 300 భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు తవ్వకాలు సాగుతున్నాయంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Illegal Silica Mining: రెచ్చిపోతున్న సిలికా మైనింగ్ మాఫియా.. అక్కడ అడుగుపెట్టాలంటే వణుకు..

వారికి ప్రతి నెలా పెద్ద మొత్తం చెల్లించాల్సిందే : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి, నెల్లూరు జిల్లాకు చెందినవారితో కలిసి సైదాపురం మండల పరిధిలో ఏకంగా ఆరు క్వార్ట్జ్‌ గనులను ఇటీవల లీజుకు తీసుకున్నారు. ఇందులో క్వార్ట్జ్‌ నిల్వలు దండిగా ఉన్న ఒకదాన్ని, దాని యజమానిని బెదిరించి మరీ తక్కువ మొత్తానికే సొంతం చేసుకున్నట్లు తెలిసింది. మొత్తంగా ఈ ఆరు లీజుల్లో పెద్దఎత్తున క్వార్ట్జ్‌ తవ్వి, తరలించేందుకు అమాత్యుడు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చిల్లకూరు, కోట మండలాల్లో మాత్రమే లభించే సిలికా శాండ్‌పై ఆ పార్టీ నాయకులు కన్నేశారు. అక్కడి 80 లీజులపై తనిఖీలు జరిపించి, ఉల్లంఘనలు జరిగాయంటూ కోట్ల రూపాయల్లో జరిమానాలు విధించేలా చేశారు.

YSRCP Leaders Anarchy : ఆ తర్వాత చెన్నై మైనింగ్‌ వ్యాపారికి చెందిన వారితో శ్రీవామన ఎంటర్‌ప్రైజెస్, వామన ఫ్యూచర్‌జెన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, గామా ఎంటర్‌ప్రైజెస్, వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట ఎండీఎల్స్‌ తీసుకొని రంగంలోకి దించారు. అసలు లీజుదారుడికి టన్నుకు 100 చొప్పున ఇస్తూ వీళ్లే తవ్వకాలు సాగిస్తున్నారు. ఆ ఖనిజాన్ని ఇతర ఎండీఎల్స్‌ యజమానులకు టన్ను 14 వందల నుంచి 15 వందల చొప్పున విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అందులోంచి వైఎస్సార్సీపీ కీలక నేతలకు ప్రతి నెలా పెద్ద మొత్తం చెల్లిస్తూ వచ్చారు. కొన్ని నెలలుగా చెన్నై వ్యాపారులను పక్కనబెట్టారు. ఓ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన నేత, ఓ మున్సిపల్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ భర్త సిలికా వ్యాపారాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. లీజుదారుల నుంచి టన్నుకు 700 చొప్పున వసూలు చేస్తూ పెద్దలకు వాటాలు పంపిస్తున్నారు.

ప్రమాదంలో కేతవరం గుహలు.. మాయమవుతున్న ఆదిమానవుల ఆనవాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.