ETV Bharat / state

'మేం మంత్రి అనుచరులం - ఈ భూమి మాది ఎవరైనా అడ్డొస్తే లేపేస్తాం'

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 12:37 PM IST

YSRCP Leaders try to Occupy Land: వైఎస్సార్సీపీ మంత్రి అనుచరులమంటూ భయపెట్టి బలవంతంగా వ్యవసాయ భూమిని ఆక్రమించాలని చూస్తున్నారని బాధిత మహిళలు వాపోతున్నారు. ఎవరైనా అడ్డుతగిలితే చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది.

YSRCP_Leaders_Try_to_Occupy_Land
YSRCP_Leaders_Try_to_Occupy_Land

'మేం మంత్రి అనుచరులం - ఈ భూమి మాది ఎవరైనా అడ్డొస్తే లేపేస్తాం'

YSRCP Leaders try to Occupy Land : బాపట్ల పరిధిలో ఉన్న 1.20 ఎకరాల వ్యవసాయ భూమిని మంత్రి మెరుగు నాగార్జున (Minister Merugu Nagarjuna) అనుచరుల పేరిట వచ్చిన కొందరు వ్యక్తులు భయపెట్టి బలవంతంగా భూమిని ఆక్రమించాలని చూస్తున్నారని అనిత అనే మహిళ ఆరోపించారు. నరాలశెట్టిపాలెం సమీపంలోనే వ్యవసాయ భూమి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆమె మాట్లాడుతూ ఆమె తెలిపిన వివరాల ప్రకారం పోతంశెట్టి వెంకట కృష్ణయ్య నుంచి 1970లో బొమ్మిశెట్టి శివరామకృష్ణ ప్రసాద్ 5.56 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిని శివరామకృష్ణ ప్రసాద్ నుంచి 1981లో తన అమ్మమ్మ కొనుగోలు చేశారని అన్నారు. పూర్వార్జిత ఆస్తి కింద తండ్రి ద్వారా భూమి తనకు సంక్రమించిందని తెలిపారు. అయితే4.36 ఎకరాల భూమిని మాత్రమే శివరామకృష్ణ ప్రసాద్ తమకు రిజిస్ట్రేషన్ చేశారని పేర్కొన్నారు

Ruling Party Leaders Rowdyism on People : సర్వే నంబర్లో తప్పు వచ్చిందని1.20 ఎకరాల భూమికి రిజిస్ట్రేషన్ ఆపేశారని అన్నారు. దీనిపై కోర్టులో వ్యాజ్యం నడుస్తుందన్నారు రెండు నెలల క్రితం వెంకట కృష్ణయ్య కోడలు శారదా దేవి కుటుంబ సభ్యులు వచ్చి భూమి తమదని వచ్చి కొలతల కొలవబోగా తాము అడ్డుకొని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 40 ఏళ్లుగా భూమి తమ ఆధీనంలో ఉందని అధికారులకు పత్రాలు చూపించామని అన్నారు. నెల రోజుల నుంచి మంత్రి మెరుగు నాగార్జున బంధువులు, అనుచరులు అంటూ 30 మంది పలుమార్లు కార్లలో వచ్చి భూమి ఖాళీ చేయాలని తమను బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శారదా దేవి నుంచి తాము కొన్నమని ఖాళీ చేయకపోతే మీ అంతు చూస్తామంటూ బలవంతంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Gandhi satram: గాంధీ సత్రాన్నీ వదలని మంత్రి.. 33 ఏళ్లకు లీజుకివ్వాలంటూ ఒత్తిళ్లు

YCP Leaders Land Grabbing in AP : మరోసారి భూమి వద్దకు వచ్చి బలవంతంగా భూమిని ఆక్రమించబోగా తమ కుటుంబ సభ్యులంతా కలిసి అడ్డుకున్నట్లు తెలిపారు. భూమి రిజిస్ట్రేషన్ విషయంపై శివరామకృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులు తమకు మధ్య కోర్టులో వివాదం నడుస్తుందని తెలిపారు. మంత్రి మెరుగు నాగార్జున పేరుతో విలువైన వ్యవసాయ భూమిని బలవంతంగా ఆక్రమించాలని చూస్తున్నారని అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరారు.

YCP Leaders Land Grabbing: భూ బకాసురులు.. ఈ సారి ఏకంగా కాలనీపైనే పడ్డారు..

మాకు రక్షణ కావాలి: మాకు తాతయ్య, అమ్మమ్మ నుంచి ఈ పొలం వచ్చింది. మేము 40 సంవత్సరాల నుంచి వరి పంట సాగు చేసుకుంటున్నాం. మంత్రి మేరుగ నాగార్జున అనుచరులమని వచ్చి ఈ పొలం మాది అని బెదిరిస్తున్నారు. నాలుగైదు సార్లు రౌడీలతో దౌర్జన్యానికి దిగారు. కేసు నమోదు చేయడానికి వెళితే ఎస్ఐ సహకరించడం లేదు. మా పైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామని అంటున్నారు. మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు. ఎవరైనా ఉన్నా లేపేస్తామని అంటున్నారు. మాకు వారి నుంచి ప్రాణహాని ఉంది. దయచేసి మాకు రక్షణ కల్పించండి. బాధిత మహిళలు

ప్రశ్నిస్తే 'దుస్తులూడదీసి కొడతాం' - సామాన్యుల ఆస్థులు ఆక్రమిస్తూ వైసీపీ నాయకుల బెదిరింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.