ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఒంగోలులో కొనసాగుతున్న భూకబ్జాలు - నకిలీ స్టాంపులు, అక్రమ రిజిస్ట్రేషన్లతో మోసాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2023, 8:33 AM IST

Land Irregularities in Ongole : భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందనే ఆశతో పైసా పైసా కూడపెట్టుకొని కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలను సైతం కబ్జాదారులు వదలడం లేదు. ఎప్పుడో కొనుగోలు చేసి, మంచి ధర వచ్చాక పిల్లలు చదువులకో, పెళ్లిళ్లకో ఉపయోగపడుతుందని భావించి స్థలాలు కొనుగోలు చేసిన పలువురు స్థల యజమానులకు భూ కబ్జాదారులు చుక్కలు చూపిస్తున్నారు. రాత్రికి రాత్రి భూమిని కబ్జా చేసి.. ఈ స్థలాలు తమవే అంటూ బోర్డు పెడుతున్నారు. ఇలా ఒంగోలు పట్టణంలో ఈ కబ్జా వ్యవహారం రోజు రోజుకు మితిమీరిపోతుంది.

Land Irregularities in Ongole
Land Irregularities in Ongole

ఒంగోలులో కొనసాగుతున్న భూకబ్జాలు - నకిలీ స్టాంపులు, అక్రమ రిజిస్ట్రేషన్లతో మోసాలు

Land Irregularities in Ongole : ఒంగోలు నగరం కబ్జాకోరల్లో చిక్కుకుంది. భూమి కనిపిస్తే చాలు.. ఆక్రమణదారులు గద్దల్లా వాలిపోతున్నారు. నకిలీ స్టాంపులు, అక్రమ రిజిస్ట్రేషన్లతో.. కోట్ల రూపాయల విలువైన భూములు, స్థలాలు ఆక్రమణకు గురికావడం ఇటీవల సంచలనం సృష్టించింది. దానిపై దర్యాప్తు జరుగుతుండగానే.. మరో భూకబ్జా వెలుగుచూసింది. కొందరు పైసాపైసా కూడబెట్టి భవిష్యత్తు అవసరాల కోసం కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలనూ కబ్జాదారులు వదల్లేదు. రాత్రికి రాత్రి ప్లాట్లు ఆక్రమించేసి.. ఇవి మావే అంటూ బోర్డు పాతేశారు.

YCP Leaders Land Grabbing: భూ బకాసురులు.. ఈ సారి ఏకంగా కాలనీపైనే పడ్డారు..

Land Irregularities in Prakasam District : భూకబ్జా దారులు దొంగ రిజిస్ట్రేషన్లతో ఈ స్థలం మాది అంటూ రావడం,అసలు యజమానులను భయబ్రాంతులకు గురిచేయడం, సెటిల్‌మెంట్‌ చేసుకొనే పరిస్థితి తీసుకురావడం లేదంటే.. కోర్టులో చూసుకుందాం అంటూ భూ యజమానులనే బెదిరించటం ఆశ్చర్యనికి గురిచేస్తుంది. ఇలా వందల సంఖ్యలో వివాదాలు నెలకొనడంతో పోలీసులు ప్రత్యేక ధర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో సుమారు 50 మంది వరకూ అరెస్టు అయ్యారు.

ఒంగోలులో రోజురోజుకూ పెరిగిపోతున్న భూ దందాలు- దొంగ వీలునామాలు, నకిలీ రిజిస్ట్రేషన్లతో కబ్జాలు

Illegal Registrations in Ongole : తాజాగా.. మినీ బైపాస్‌కు ఆనుకొని ఉన్న ఓ ప్రైవేట్‌ వెంచర్‌లోనూ ఆక్రమణదారులు చొరబడ్డారు. ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలోని మామిడిపాలెంలో.. సర్వే నెంబర్‌ 14/2 లో.. 2004 నుంచి 2006 వరకూ కొంతమంది ఓ ప్త్రెవేట్‌ వ్యక్తులు వేసిన వెంచర్‌లో భవిష్యత్తు అవసరాలకు పనికి వస్తుందని భూమిని కొనుగోలు చేసారు.. అప్పట్లో ముళ్లకంపలతో ఉన్న ఈ ప్రాంతంలో కొనుగోలు దారులు సరిహద్దు రాళ్లు వేసి వదిలేసారు.

Owners are Losing Their own Lands in Ongole : భవిష్యత్తులో మంచి ధర పలికాక.. పిల్లల చదువులు, పెళ్లిళ్లకు విక్రయించుకుంటే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని భావించి.. తమ స్థలాల చుట్టూ రాళ్లు పాతారు. అంతలోనే.. వీటిపై కబ్జాకోరుల కన్నుపడింది.రాత్రికిరాత్రే సరిహద్దు రాళ్లు పీకేసి.. ఈ ప్లాట్లు తమవే అంటూ బోర్డు పెట్టేశారు. ఇదంతా చూసి ప్లాట్ల యజమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎన్నో ఏళ్లుగా తమ పేరుమీద ఉన్న స్థలాలు, లింక్ డాక్యుమెంట్లు, ఈసీలు వంటిని అన్నీ పక్కగా ఉన్నా.. ఎలా కబ్జా చేశారో తెలియక స్థల యజమానులు కలవరపడుతున్నారు. తమ స్థలాన్ని కబ్జా చేయటమే కాకుండా.. ఈ స్థలం తమదే అంటూ ప్రకటన బోర్డులు సైతం పెడుతున్నారు.

Land Occupation: ఆ మంత్రుల నియోజవర్గాల్లో యథేచ్ఛగా భూ అక్రమాలు..

ప్లాట్ల కొనుగోలుదారులు.. బోర్డుపై ఉన్న నెంబర్‌కు ఫోన్ చేస్తే.. ఈ స్థలం తమదే అంటూ.. 2015లో కొనుగోలు చేశామంటూ.. అవతలి వ్యక్తి చెబుతున్నారు. అసలు యజమానులు కన్నా ముందుగానే ఈ కబ్జాదారులు స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో ఏం చేయాలో తెలియక ప్లాట్ల యజమానులంతా.. డీఎస్పీని కలిసి తమ సమస్యను విన్నవించారు. తమ స్థలాలను కాపాడి న్యాయం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details