ETV Bharat / state

park occupied 42 ఏళ్ళ నుంచి పార్కుగా ఉన్న స్థలంలో.. ఇప్పుడు ప్లాట్లు ఎలా వేస్తారు: గౌరు చరితా రెడ్డి

author img

By

Published : May 21, 2023, 10:30 PM IST

park was occupied in Kurnool: కర్నూలు పట్టణ పరిధిలోని జొహరాపురం నజర్ కాలనీలో పార్కు స్థలాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించారని స్థానికులు మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పార్కు స్థలాన్ని పరిశీలించిన ఆమె.. కబ్జాదారులపై ఎందుకు అధికారులు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కర్నూలులో 42 ఏళ్ళనాటి పార్కు కబ్జా.. పట్టించుకోని అధికారులు
park was occupied in Kurnool

park was occupied in Kurnool: కర్నూలు పట్టణ పరిధిలోని 19వ వార్డు నగరపాలక సంస్థకు చెందిన పార్కు స్థలాలు అన్యాక్రాంత మవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు. జొహరాపురం నజర్ కాలనీలో పార్కు స్థలాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించారని స్థానికులు మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆమె స్థలాన్ని పరిశీలించారు. 42 ఏళ్ళ కిందట పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు అక్రమించారని అన్నారు. స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఇక్కడ పార్క్ ఉందని ఇళ్లు, అపార్ట్మెంట్​లను ఎక్కువ ధరకు కొనుగోలు చేశామని ఇప్పుడు పార్క్ లేకుంటే ఎలా అని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ నిధులతో పార్క్​ చుట్టూ కంచే వేసి దిమ్మలు వేయించారని వాటిని కబ్జాదారులు తొలగించినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని స్థానికులు ప్రశ్నించారు. ప్లాట్​లు వేసిన వారిని ప్రశ్నిస్తే పార్క్​నే అక్రమించిన వాళ్లం.. మీ ఇళ్లను ఆక్రమించలేమా అని భయపెడుతున్నారని స్థానిక మహిళలు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పార్క్ స్థలాన్ని కాపాడాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేవడతామని గౌరు చరితా రెడ్డి తెలిపారు.

ఈ కాలనీ ఏర్పడీ 42 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ సుమారుగా రెండు ఎకరాల పార్కు ఉన్నది ఆ పార్కును ఏప్పటి నుంచో కబ్జా కాకుండా కాపాడుకుంటూ వచ్చాము. ఈ పార్కు అభివృద్ది చేయడానికి చాలాసార్లు మా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ పార్కుకు మున్సిపల్​ అధికారులు చుట్టూ కంచే వేసి క్లీనింగ్​ చేయడం జరిగింది. ఈ మధ్యన కొంత మంది వచ్చి కోర్టు నుంచి ఆర్డర్స్​ తెచ్చాం అని చెప్పి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసురోవాలని కోరుకుంటున్నాం.- బాలీశ్వర్ రెడ్డి, స్థానికుడు

గత 42 సంవత్సరాలుగా ఇక్కడ పార్కు ఉంది. గతంలో మున్సిపల్​ అధికారులే పార్క్​ చుట్టూ కంచె వేయడం జరిగింది. అప్పటి నుంచి చుట్టు పక్కల వారు ఎదురుగా పార్కు ఉందనే ఉద్దేశంతో ఎక్కువ రెట్లు పెట్టి స్థలాలు కొనడం, ఇళ్లు కట్టుకోవడం వంటివి చేశారు. ఇప్పుడు కొత్తగా కొంత మంది నాయకులు వచ్చి ప్లాట్లు వెస్తుంచే మున్సిపల్​ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అడుగుతున్నా- గౌరు చరితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

park was occupied in Kurnool

ఇవీ చదంవడి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.