ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో అరాచక, విధ్వంసకర పాలన : జగన్ ప్రభుత్వంపై బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ ఫైర్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2023, 4:24 PM IST

Bharatiya Janata Party State Executive Meeting in Ongole: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రకాశం జిల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ నాయకులు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్​ సంతోష్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలపై పలు ఆరోపణలు చేశారు.

bjp_state_executive_meeting
bjp_state_executive_meeting

Bharatiya Janata Party State Executive Meeting in Ongole:భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, రాష్ట్ర నాయకులు వాకడ నారాయణ రెడ్డి, శివ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ప్రధాన అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో బీఎల్​ సంతోష్ మాట్లాడుతూ సంస్థాగత విషయాలపై దృష్టి పెట్టీ, పార్టీ పటిష్టతకు అంతా కృషి చేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ప్రారంభించారు.

రాష్ట్రంలో అరాచక, విధ్వంసకర పాలన : జగన్ ప్రభుత్వంపై బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ ఫైర్

దళిత యువకుడు బొంతు మహేంద్రది ప్రభుత్వ హత్యే - ఎస్సీలకు మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నారు : దగ్గుబాటి పురందేశ్వరి

ప్రారంభ ఉపాన్యాసంలో దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeshwari) మాట్లాడుతూ రాష్ట్రంలో కరవుపై అధ్యయనం చేయడానికి ప్రాంతాల వారీగా నాలుగు కమిటీలు నియమిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో అరాచక, అవినీతి, విధ్వంసకర పాలనపై బీజేపీ ఉద్యమం చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచకం, వినాశకర, విధ్వంసం పాలన జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భగుడిలో దేవుడు విగ్రహాన్ని దొంగలు పడి దోచుకున్నా పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఎదురించినా, ప్రశ్నించినా అమాయకులపై ఎట్రాసిటీ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఒక పక్క సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం కేంద్రం చేస్తోందని అన్నారు.

ఏపీలో కక్షపూరిత, విధ్వంస రాజకీయాలు - వైసీపీ కుంభకోణాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి : పురందేశ్వరి

బీసీ కమిషన్‌కు చట్టబద్దతను తొలగించి, ఎస్సీ సబ్ ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టించిన వైసీపీ ప్రభుత్వానికి సామాజిక సాధికారత యాత్ర (YSRCP Samajika Sadhikara Bus Yatra) చేసే హక్కు లేదని పురందేశ్వరి అన్నారు. టీటీడీ అన్యమతస్తుల విషయంలో ప్రతి ఘటన చేసింది బీజేపీ మాత్రమేనని.. ఈ విషయంలో ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటం చేస్తామని తెలిపారు.. సర్పంచ్​లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. పంచాయతీ నిధులు (Panchayat funds) కోసం బీజేపీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా పురందేశ్వరి తెలిపారు.

AP BJP President Daggubati Purandeswari Press Meet: 'ఇసుక, మద్యం పాలసీతో వైసీపీ ప్రభుత్వం భారీ దోపిడీ.. సామాన్యుల జీవితాలు ఛిన్నాభిన్నం'

ఇసుక మాఫియాపై ప్రశ్నిస్తే వ్యక్తి గత దూషణలుకు రాష్ట్ర ప్రభుత్వం దిగుతోంది.. అలాంటి ఈ ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేసింది.. గళం విప్పింది బీజేపీ మాత్రమేనని అన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పాలన అందిస్తుందని అన్నారు.. దశాబ్దాల కాలంగా పెండింగ్​లో ఉన్న మహిళా బిల్లు కేంద్రం తీసుకుని వచ్చింది.. మహిళా బిల్లు (Women Bill) 33 శాతం రిజర్వేషన్ అమలుకు బీజేపీ చిత్తశుద్ధితో కల్పించిందని అన్నారు. ప్రతిపక్షాలు మహిళా బిల్లును మభ్య పెడుతూ వచ్చాయి.. ఎస్సీ వర్గీకరణ సామాజిక వర్గాల కోసం కేవలం బీజేపీ మాత్రమే కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details