ETV Bharat / state

మద్యం డబ్బులు 'జె' ట్రెజరీకి, ఇసుక దోపిడీ సొమ్ము 'పీ' ట్రెజరీకి - రాష్ట్రంలో మద్యం ఆర్డీఎక్స్ కన్నా ప్రమాదకరం : పురందేశ్వరి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 5:21 PM IST

BJP leaders allegations against CM Jagan: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... అధికార వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. మద్యం డబ్బులు జె ట్రెజరీ, ఇసుక దోపిడీ సొమ్ము పీ ట్రెజరీకి వెళ్తున్నాయని విమర్శించారు.

BJP leaders allegations against CM Jagan
BJP leaders allegations against CM Jagan

BJP leaders allegations against CM Jagan: ఉగ్రవాదం కన్నా రాష్ట్రంలో మద్యం చాలా ప్రమాదకరమైందని... అర్డీఎక్స్ కన్నా అత్యంత ప్రమాదకరమైన ఆయుధం మద్యం.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఘాటుగా వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ఆమె కడప పార్లమెంటరీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కడపలో సమావేశం నిర్వహించారు.

మద్యం డబ్బులు 'జె' ట్రెజరీకి, ఇసుక దోపిడీ సొమ్ము 'పీ' ట్రెజరీకి - రాష్ట్రంలో మద్యం ఆర్డీఎక్స్ కన్నా ప్రమాదకరం : పురందేశ్వరి

పురందేశ్వరి: వివిధ దేశాల మద్యం యుద్దంలో వేలమంది మృతి చెందితే .. మద్యం కారణంగా రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు మృత్యువాత పడటం బాధాకరం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం ద్వారా దోచుకున్న డబ్బు పెద్దిరెడ్డి ట్రెజరీకి వెళ్తోందని పురందేశ్వరి ఆరోపించారు. మద్యం డబ్బులు జె (జగన్) ట్రెజరీ, ఇసుక దోపిడీ సొమ్ము పీ (పెద్దిరెడ్డి) ట్రెజరీకి వెళ్తోందని విమర్శించారు. రైతులను దగా చేసి మాయ మాటలు చెప్పడం జగన్ అలవాటన్న ఆమె.. తప్పులు బయటకు వస్తే జైలుకు పోతామనే భయం వారిని వెంటాడుతుందన్నారు. రాష్ట్రంలో కరువు తాండవం చేస్తున్నా, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడంలేదని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో ప్రభుత్వ భూములు కాజేయడానికి కలెక్టర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసిన మాట వాస్తవం కాదా అంటూ నిలదీశారు.

'చంద్రబాబు ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు వైసీపీ దొంగ లేఖ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం దూరం'

సీఎం రమేష్: గత మూడు నెలలుగా ఇసుక డబ్బులు వసూలు చేస్తోంది జేపీ సంస్థ... జేపీ సంస్థ అంటే జగన్. పెద్దిరెడ్డి ట్రెజరీ అని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఎద్దేవా చేశారు. ఇపుడు రాష్ట్రమంతా ముఖ్యమంత్రి సోదరుడు అనిల్ రెడ్డి ఇసుక దోపిడీకి తెర లేపాడని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీకి అదాని పేరు చెప్పడం భావ్యం కాదన్న సీఎం రమేష్... ఆదానీకి సంబంధం లేకుండానే అంజిరెడ్డి అనే వ్యక్తి ఇసుక దోపిడీ చేస్తున్నట్లు మాకు ఆధారాలు ఉన్నాయన్నారు. క్యాబినెట్ మీటింగ్​లో కరువు జిల్లాలు ప్రకటిస్తారని అనుకుంటే... క్యాబినెట్ మీటింగ్​లో జగన్ సోదరుడు అనిల్​కు ఇసుక టెండర్ కట్టబెట్టే ప్రక్రియ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ నేతల వసుల్ల పర్వం కొనసాగుతుందిని ఆరోపించారు. కరువు మండలాలను గుర్తించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సీఎం రమేష్ ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ రైతుల దగ్గరకు వెళితే... కరువు పరిస్థితులపై నిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి: వైసీపీ నాయకుల అక్రమాలు బహిర్గతం చేస్తున్నదని తమ పార్టీ అధ్యక్షురాలిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం నడవటం లేదని.. కేవలం భారతి రాజ్యాంగం నడుస్తుందని ఎద్దేవా చేశారు. బీజేపీ మీటింగ్​కు రాకుండా ప్రెస్​ను సైతం భయపెడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే జరుగుతోంది : పురందేశ్వరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.