ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వీళ్లా, ఎమ్మెల్సీ అభ్యర్దులు..! వైసీపీ అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు: టీడీపీ

By

Published : Mar 11, 2023, 9:25 PM IST

irregularities in the MLC elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు స్పందించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతుందన్నారు. దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి సాక్ష్యాలతో సహా 9ఫిర్యాదులు చేశామని వెల్లడించారు.

MLC elections
ఎమ్మెల్సీ ఎన్నికలు

irregularities in the MLC elections: పెద్దల సభని అగౌరవ పరిచేలా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని నిలపెట్టారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తింది. దొంగ ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి సాక్ష్యాలతో సహా 9ఫిర్యాదులు చేశామని ఆ పార్టీ నేత బోండా ఉమామహేశ్వర రావు పేర్కొన్నారు. తాడేపల్లి ఆదేశాలు పాటించి పనిచేస్తున్న అధికారులు, పోలీసులు చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమ ఓట్లపై బోండా ఉమా మహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం నిర్వహించారు.

మద్యం అక్రమ రవాణా కేసు: తూర్పు రాయలసీమ అభ్యర్థి పేర్నేటి శ్యాం ప్రసాద్ రెడ్డి మద్యం అక్రమ రవాణాలో నిందితుడని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉండి బెయిల్ పై ఉన్న వ్యక్తిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలిపారని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కల్తీ మద్యం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యక్తిని ఎమ్మెల్సీ చేయాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అప్పుతో కలిసి శ్యాం ప్రసాద్ రెడ్డికల్తీ మద్యం తయారీ చేశాడని నిమ్మల ఆరోపించారు. తాను బెయిల్ పై ఉండి సీఎంగా ఉన్నందున శ్యాం ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ అయితే తప్పేంటనే భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని నిమ్మల ఎద్దేవా చేశారు. విజ్ఞులైన పట్టభద్ర ఓటర్లు ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

వెండి బిస్కెట్లు: పదవులపై కక్కుర్తితో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని నాశనం చేసి అధికార కాంక్షను చాటుకుంటున్నారని నిమ్మల దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచ్చల విడిగా దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో విద్యార్హత ఇంటర్మీడియట్ అని చూపిన ఇద్దరు వైసీపీ కార్యకర్తలు పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్లెలా అయ్యారని టీడీపీ బోండ ఉమా ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దెబ్బకు రాష్ట్రంలో రూ.2వేల నోటు చూద్దామన్నా కనిపించట్లేదని విమర్శించారు. వెండి బిస్కెట్లతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు.

7 వతరగతి చదవని వారు గ్రాడ్యుయేట్స్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లపై వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారి అందుబాటులో లేకపోవటంతో కార్యాలయ సిబ్బందికి ఫిర్యాదును అందజేశారు. జగన్ పాలనలో ఎన్నిక ప్రక్రియ దొంగాటలా ఉంది తప్ప ఎన్నికలా లేదని విమర్శించారు. 7 వతరగతి చదవని వారు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎలా అవుతారని ప్రశ్నించారు. తిరుపతిలో చికెన్ షాపు అడ్రస్ తో 16 మందికి ఓటు హక్కు కల్పించారని మండిపడ్డారు. డేటా ఎంట్రీలో పొరపాటు వల్లే చికెన్ షాపు అడ్రస్ తో ఓట్లు కల్పించామని తిరుపతి కలెక్టర్ చెప్పటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లతో గెలవడానికి ఇక ఈసీ ఎందుకు, ఎన్నికలెందుకని నిలదీశారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై టీడీపీ నేతల మీడియా సమావేశం

ఇవీ చదంవడి:

ABOUT THE AUTHOR

...view details