ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కేంద్రం తలుచుకుంటే 24 గంటల్లో జగన్‌ జైలుకు వెళ్తాడు: విష్ణుకుమార్​రాజ్

By

Published : Apr 1, 2023, 2:14 PM IST

Updated : Apr 2, 2023, 6:15 AM IST

BJP state president Somu Veerraju fire on cm jagan: భారతీయ జనతా పార్టీ నేత సత్యకుమార్‌ వాహనంపై దాడి ఘనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసినవారిపై హత్యయత్నాంతో పాటుగా కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సత్యకుమార్‌ వాహనంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌, వైసీపీ కార్యకర్తలపై సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

BJP state president
BJP state president

BJP state president Somu Veerraju fire on cm jagan: సత్యకుమార్‌పై వైసీపీ దాడికి పోలీసుల వైఫల్యం, ప్రభుత్వ చేతగానితనమే కారణమని బీజేపీ నేతలు మండిపడ్డారు. దాడికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. వైసీపీ దౌర్జన్యాల్ని కేంద్రం గమనిస్తోందన్న నేతలు... మోదీ సర్కార్ తలుచుకుంటే 24 గంటల్లో జగన్‌ను జైలుకు వెళతారని హెచ్చరించారు.


బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ సహా ఎస్సీ నాయకుడు సురేశ్‌పై పథకం ప్రకారమే వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పార్టీ నాయకులతో కలిసి విజయవాడలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గుంటూరు లాడ్జి సెంటర్‌లో బీజేపీ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన కార్యకర్తల నుంచి పోలీసులు పెట్రోలు సీసా లాక్కున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలపై పెట్రోల్‌ పడింది. దీనిపై ఆగ్రహించిన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. వారిని బలవంతంగా తరలించేందుకు పోలీసులు యత్నించడంతో... ఘర్షణ వాతావరణం నెలకొంది.

వైసీపీ దాడికి నిరసనగా ఏలూరులో జిల్లా కోర్టు నుంచి ఎస్పీ కార్యాలయం వరకు బీజేపీ నాయకులు ర్యాలీ చేశారు. శ్రీకాకుళం "డే అండ్‌ నైట్" కూడలి నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. సత్యకుమార్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతిపత్రం అందజేశారు. మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన కమలం శ్రేణులు... కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. సత్యకుమార్‌పై వైసీపీ దాడిని ఖండిస్తూ విశాఖలో భాజపా నాయకులు ధర్నా చేశారు. వైసీపీ తీరు మార్చుకోకుంటే తగిన బుద్ధి చెప్పక తప్పదని నేతలు హెచ్చరించారు.

వైసీపీ దాడికి నిరసనగా కర్నూలులో పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. కడప కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఎంపీ సి.ఎం.రమేష్ పాల్గొన్నారు. వైసీపీ ఆగడాలను కేంద్రం గమనిస్తోందని..., సరైన సమయంలో చర్యలు తప్పదని హెచ్చరించారు. వైసీపీ దాడులను సహించేది లేదని, సత్యకుమార్‌పై దాడికి కారకులైన వారిని శిక్షించే వరకు ఆందోళనలు ఆగవని... బీజేపీ నాయకులు స్పష్టంచేశారు.

దాడి ఘనపై బీజేపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు

ఇవీ చదవండి

Last Updated : Apr 2, 2023, 6:15 AM IST

ABOUT THE AUTHOR

...view details