ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Employees Letter to CS Jawahar Reddy on PRC : పెన్షన్ నిధిలో ప్రభుత్వ వాటా తక్షణం చెల్లించాలి.. సీఎస్​కు ఉద్యోగుల వినతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2023, 1:08 PM IST

Updated : Oct 14, 2023, 3:00 PM IST

Employees Letter To CS Jawahar Reddy On PRC Problems : సీపీఎస్​ విధానంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను రాష్ట్రం పాటించాలని సీపీఎస్​ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఆర్సీ అరియర్లు, పీఆర్సీ బకాయిలతో పాటు పెన్షన్ నిధిలో ప్రభుత్వ వాటాను తక్షణమే చెల్లించాలని సీఎస్​ జవహర్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ మేరకు ఉద్యోగులంతా వేతనాల ఆలస్యం విషయమై నిరసనలు చేస్తున్నారు.

Etv BharatEmployees Serious ON PRC Issue 2023
Etv BharatEmployees Letter to CS Jawahar Reddy on PRC

Employees Letter To CS Jawahar Reddy On PRC Problems :పీఆర్సీ అరియర్లు, పీఆర్సీ బకాయిలతో పాటు పెన్షన్ నిధిలో ప్రభుత్వ వాటాను తక్షణమే చెల్లించాలని సచివాలయ సీపీఎస్​ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎస్​ జవహర్ రెడ్డికి సచివాలయ సీపీఎస్​ అసోసియేషన్ వినతి పత్రం అందించింది. ఉద్యోగులు తాము ఆమోదం తెలపకముందే ప్రభుత్వం ప్రతిపాదించిన ఊహాజనిత గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. సీపీఎస్​ విధానంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను రాష్ర్టం పాటించాలన్నారు.

గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల డిమాండ్లపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. కొత్త పీఆర్సీ ఈ ఏడాది జులై నాటికే అమలులోకి రావాల్సి ఉండగా.. అందలేదు. దీంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వరుస వినతి పత్రాలు పంపుతూనే ఉన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి తక్షణ చర్యలు చేపట్టమని సీఎంఓ ఆర్థిక శాఖను ఆదేశించింది.

సచివాలయంలోని 50 మంది అసిస్టెంట్‌ సెక్రటరీలకు రివర్షన్‌..

Employees Serious ON PRC Issue 2023 :ఉద్యోగుల మద్ధతు లేకుండా ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌పై గుర్రుగా ఉన్న సీపీఎస్​ ఉద్యోగులు ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఎస్​కు విజ్ఞాపన పత్రం ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఆర్సీఅరియర్లు, పెన్షన్ నిధిల్లో ప్రభుత్వ వాటా చెల్లింపులు తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ పై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవటంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నామని సీపీఎస్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 2022 నుంచి నేషనల్ పెన్షన్ ట్రస్టుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరిగ్గా చెల్లింపులు జరగక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సీపీఎస్​లో కేంద్ర ప్రభుత్వం పెంచిన 14 శాతం ప్రభుత్వ వాటాను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

సీపీఎస్​ను సరిగ్గా అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం తమ వేతన స్లిప్పుల నుంచి జీపీఎస్ పేరిట కోత విధించటం సరికాదని సంబంధిత బాధిత ఉద్యోగులు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఉద్యోగుల ఆమోదం లేకుండా జీపీఎస్​ ను అమలుచేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 60 నెలలుగా డీఏ బకాయిలు పెండింగ్​లో ఉన్నాయని సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ స్పష్టం చేసింది. 2023 సెప్టెంబరులో డీఏ బకాయిలు చెల్లిస్తామని మంత్రుల కమిటీ చెప్పింది. కానీ ఇప్పటికీ అమలు కాలేదని ఉద్యోగులు ఆక్షేపించారు. దసరా పండుగకు అయినా సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు.. అధికారులతో సీఎస్ సమీక్ష

మరోవైపు జీపీఎస్​ సహా పెండింగ్ అంశాలపై తక్షణం ఉద్యోగుల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని.... సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని సీపీఎస్ ఉద్యోగులు కోరారు. దీనికోసం ఉద్యోగుల సంతకాలతో కూడిన నోటీసును అందజేశారు. ఉద్యోగ విరమణ అనంతరం సురక్షితమైన పెన్షన్ తీసుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్​ నేడు ప్రధాన అడ్డంకిగా మారిందని ఉద్యోగులు తెలిపారు.

60 నెలలుగా డీఎ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్న ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను పట్టించుకోవాలని కోరుతూ.. విజయదశమి వరకైనా వారి డిమాండ్లను నెరవేర్చాలన్నారు.

పీఆర్‌సీపై 3 రోజుల్లోగా సీఎం జగన్‌ నిర్ణయం: సీఎస్‌ సమీర్‌శర్మ

Last Updated :Oct 14, 2023, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details