ETV Bharat / state

అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశాం- బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోంది: కాంట్రాక్టర్లు - Water Supply Contractors Meeting

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 5:14 PM IST

Water Supply Contractors Meeting: అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం 8 నెలలుగా బిల్లులు చెల్లించకుండా వేధిస్తోందని వాటర్‌ సప్లై కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్ నాయకులు ఆరోపించారు. విజయవాడలో అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. అనేక ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా కోసం పనులు చేస్తే, చివరి నిమిషంలో నిబంధనలు మార్చేసి రూ. 800 కోట్ల బిల్లులు నిలిపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు విడుదల చేయాలని, లేకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Water Supply Contractors Meeting
Water Supply Contractors Meeting (ETV Bharat)

Water Supply Contractors Meeting: విజయవాడలో వాటర్ సప్లై కాంట్రాక్టర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎనిమిది నెలలుగా బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్లు ఆరోపించారు. అప్పులు తెచ్చి, అభివృద్ధి పనులు చేశామని కాంట్రాక్టర్​లు ఆవేదన వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో నిబంధనలు మార్చి బిల్లు ఆపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించకుంటే ఆందోళనకు సిద్దం కావాలని నిర్ణయించినట్లు కాంట్రాక్టర్లు వెల్లడించారు.

అనేక ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా కోసం పనులు చేశామని కాంట్రాక్టర్లు తెలిపారు. జలజీవన్ మిషన్ కింద కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలన్న కాంట్రాక్టర్లు, రాష్ట్రం డబ్బులు ఇవ్వకపోవడంతో కేంద్రం కూడా నిధులు నిలిపేసిందన్నారు. ఇప్పుడు ఎనిమిది నెలలుగా బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు. పాలకులు, అధికారులను కలిసినా స్పందన లేదని కాంట్రాక్టర్లు వాపోయారు.

ఆరు నెలలుగా బిల్లుల పెండింగ్ - ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదు: ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సంఘం

నిబంధనల ప్రకారం బిల్లులు ఫ్రొఫార్మాలో అందచేశామన్న కాంట్రాక్టర్లు, ఇంతకాలం సైలెంట్​గా ఉన్న అధికారులు ఇప్పుడు నిబంధనలు మారాయి అంటున్నారని తెలిపారు. ఎనిమిది వందల కోట్లు బిల్లులు నిలిపివేయడం అన్యాయమని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి పనులు పూర్తి చేస్తే బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు మండిపడ్డారు. అప్పులు, వాటి వడ్డీలు పెరిగిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.

కోర్టు ఆదేశాలను కూడా అమలు చేయకుండా నిర్లక్ష్యంతో ఉన్నారని విమర్శించారు. తమ బిల్లలు చెల్లించాలని మరోసారి ఉన్నతాధికారులను కలుస్తామన్న కాంట్రాక్టర్లు, స్పందన రాకుంటే ఆందోళనలు, నిరసన దీక్ష చేపడతామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. వచ్చే ప్రభుత్వంపై భారం మోపి, తప్పుకునేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. తమ‌ బిల్లులు తమకు చెల్లించేలా అధికారులు స్పందించాలని, లేదంటే మధ్యలో ఉన్న పనులు కూడా పూర్తిగా నిలిపి వేయాల్సి ఉంటుందని కాంట్రాక్టర్లు హెచ్చరించారు.

అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే - బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోంది: కాంట్రాక్టర్లు (ETV Bharat)

"మేము ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్యకారణం ఏమిటంటే, 17వ తేదీన ఒక మెమో ఇష్యూ చేశారు. దీనిపై కాంట్రాక్టర్లు అందరిలో గందరగోళం నెలకొంది. ఈ మెమో కారణంగా కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు కాలేదు. అదే విధంగా వచ్చినవి కూడా రిటర్న్ చేసేశారు. దీనికారణంగా వారికి ఇష్టమొచ్చిన వారికి, కొత్తవారికి బిల్లులు ఇచ్చుకొనే అవకాశం ఉంది. అంతే కాకుండా కొత్త ప్రభుత్వం వస్తే మా దగ్గర పెండింగ్ బిల్లులు లేవు అని చూపించుకునేందుకు ఒక ఎత్తుగడగా ఇది కనిపిస్తోంది". - కాంట్రాక్టర్లు

మాటల్లో గొప్పతనం.! చెల్లింపుల్లో చేతకాని తనం.! - YCP Govt Delaying Payment

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.