ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిషేదమని చెప్పి, నాసిరకం మద్యాన్ని తెచ్చారు! చనిపోయిన 34 వేల మంది కుటుంబాలకు జగన్ ఇప్పుడు ఏం సంజాయిషి చెబుతారు!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2023, 4:25 PM IST

Updated : Nov 18, 2023, 4:40 PM IST

Achchennaidu Fire on Jagan Alcohol Ban Speeches: తాము అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానన్న సీఎం జగన్‌.. ఊరూ, వాడా నాసిరకం లిక్కర్‌ తెచ్చి ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని.. అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. బ్లాక్‌లో సినిమా టికెట్లు అమ్మిన మాదిరిగా వైసీపీ నేతలు నాసిరకం మద్యాన్ని అమ్ముతున్నారని దుయ్యబట్టారు. ఫుడ్ డోర్ డెలివరీ చేసినట్లు మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Achchennaidu_on_Jagan_Alcohol_Ban_Speeches
Achchennaidu_on_Jagan_Alcohol_Ban_Speeches

Achchennaidu Fire on Jagan Alcohol Ban Speeches: మద్యపాన నిషేధానికి సంబంధించి.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని నిషేధిస్తామని హామీల మీద హామీలు ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఊరూ, వాడాలో నాసిరకం లిక్కర్‌ తెచ్చి, ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్‌లో సినిమా టికెట్లు అమ్మిన మాదిరిగా వైసీపీ నేతలు రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని అమ్ముతున్నారని దుయ్యబట్టారు. కల్తీ మద్యం తాగి గత నాలుగున్నరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 34 వేల మంది చనిపోయారని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడా కుటుంబాలకు జగన్ ఏం సంజాయిషి ఇస్తారని మండిపడ్డారు.

Achchennaidu Comments: గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మద్య నిషేధంపై ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ చేసిన ప్రసంగాలను అచ్చెన్నాయుడు ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..''మద్యం నిషేధమన్న జగన్‌ ఊరూ, వాడాకి నాసిరకం మద్యం తెచ్చారు. నాసిరకం మద్యం తెచ్చి, ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఫుడ్ డోర్ డెలివరీ చేసినట్లు మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. నాసిరకం మద్యం తయారీ నుంచి అమ్మకం వరకు అన్నీ జగనే. కల్తీ మద్యంతో పేదల ప్రాణాలు తీస్తున్నారు. కల్తీ మద్యం తాగి గత నాలుగేళ్లలో 34 వేల మంది చనిపోయారు. ధరలు పెంచితే మద్యం తాగేవారు తగ్గుతారన్నది పిచ్చి వాదన. వైసీపీ పాలనలో ప్రతి ఏటా మద్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.'' అని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

21 బీసీ కులాల భౌగోళిక పరిమితులు రద్దు - సీఎం జగన్ బీసీల ద్రోహి: అచ్చెన్నాయుడు

Achennaidu on Alcohol Revenue Calculations: మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం విషయంలో ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించిన లెక్కలపై అచ్చెన్నాయుడు ఆగ్రహించారు. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ అధికారిక ఆదాయం రూ.1.14 లక్షల కోట్లయితే.. అనధికారికంగా సీఎం జగన్‌కు రూ.లక్ష కోట్ల సొంత ఆదాయం వచ్చిందని ఆయన ఆక్షేపించారు. ధరలు పెంచితే మద్యం తాగేవారు తగ్గుతారన్నది ఓ పిచ్చి వాదనేనని అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసీపీ పాలనలో ఏటా మద్యం ధరలు పెరిగాయే తప్ప.. ఎక్కడా, ఎప్పుడు తగ్గలేదన్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో కనీసం 30 శాతం హామీలు కూడా సీఎం జగన్ నెరవేర్చలేదన్న అచ్చెన్నాయుడు.. 99 శాతం హామీలు అమలు చేశామని జగన్ చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

Achchennaidu on Skill Development Scam: 'చంద్రబాబును 30ఏళ్లుగా చూస్తున్నా.. తప్పు చేయరు.. ఎవరినీ చేయనివ్వరు'

''కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతుందని ప్రతిపక్ష నేతగా జగన్‌ అన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో మద్యం దుకాణాలు రద్దు చేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే మద్యాన్ని పరిమితం చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ఎక్కడికక్కడ మద్యం దుకాణాలు తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఫుడ్‌ డెలివరీ లాగా మద్యాన్ని డోర్‌ డెలివరీ చేస్తున్నారు. నాసిరకం మద్యాన్ని అమ్ముతున్నారు. నాసిరకమైన మద్యం వల్ల ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు. చంద్రబాబు పాలనలో మద్యం మీద రూ.50 వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. జగన్‌ నాలుగేళ్ల పాలనలో మద్యంపై రూ.1.10లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. '' -అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు

నా ఎస్సీ, ఎస్టీలు అంటూనే వాళ్లపై జగన్ దాడులు చేస్తున్నారు: అచ్చెన్నాయుడు

Last Updated :Nov 18, 2023, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details