ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎం జగన్ మాటల్లో ప్రగల్బాలు చేతల్లో శూన్యం, కౌలు రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కన్నీళ్లే!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 6:58 AM IST

Tenant Farmers Problems in YSRCP Government: కౌలు రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కన్నీళ్లే మిగులుతున్నాయి. కొత్త చట్టం తెచ్చామని సీఎం జగన్‌ ఆర్భాటంగా చెప్తున్నా భూ యజమాని అంగీకారం లేనిదే సాగుదారు హక్కు పత్రాలు లభించడం లేదు. కార్డులు లేక, ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేక కౌలు రైతులు పెట్టుబడుల కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రొఫెసర్‌ రాధాకృష్ణ కమిషన్‌ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మొత్తం కౌలు రైతుల సంఖ్య 24 లక్షలకు పైనే ఉన్నా వీరిలో 10 శాతం మందికి కూడా రాయితీ పథకాలు, పంట రుణాలు దక్కడం లేదు.

Tenant_Farmers_Problems_in_YSRCP_Government
Tenant_Farmers_Problems_in_YSRCP_Government

సీఎం జగన్ మాటల్లో ప్రగల్బాలు చేతల్లో శూన్యం, కౌలు రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కన్నీళ్లే!

Tenant Farmers Problems in YSRCP Government :రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో రుణ అర్హత కార్డులతో పాటు, మండల వ్యవసాయ అధికారులు కూడా భూ యజమాని అంగీకారంతో పని లేకుండా సీఓసీ కార్డులు (COC Cards) ఇచ్చేవారు. వాటి ఆధారంగానే రైతులకు లక్ష వరకు హామీ లేని పంట రుణాలు ఇచ్చారు. భూ యజమానుల పట్టాదారు పాసు పుస్తకంతో కౌలు రైతుల వేలిముద్రపై విత్తనాలు ఇచ్చేవారు. రాయితీ పథకాలు (Subsidy Schemes to Farmers) కూడా అందేవి. కౌలు రైతులకు పంటరుణాల విషయంలో బహుళ ప్రయోజన విస్తరణాధికారులు చొరవ తీసుకునేవారు. అందుకే అప్పట్లో కౌలు రైతులకు పంట రుణాలు ఏడాదికి 3 వేల కోట్ల నుంచి 4 వేల కోట్లకు పైగా దక్కాయి. మండల వ్యవసాయ అధికారి ఇచ్చే కార్డు ఉంటే రాయితీ విత్తనాలు కూడా ఇచ్చేవారు.

కౌలు రైతు గోడు ప్రభుత్వానికి పట్టదా? సాగునీరు లేక బ్యాంకు రుణాలు రాక అవస్థలు

CM Jagan Cheating Tenant Farmers :వైఎస్సార్సీపీ పాలనలో కౌలు రైతులకు కార్డుల (Cards for Tenant Farmers) జారీలోనూ అలవిమాలిన జాప్యం జరుగుతోంది. ఖరీఫ్‌ ఆరంభంలోనే కౌలుదారుల్ని గుర్తించి వెంటనే కార్డులు ఇవ్వడం ప్రారంభించాలి. కానీ అధికారులు జూన్, జులైలో కార్డుల జారీ మొదలుపెట్టి తూతూమంత్రంగా సెప్టెంబరు వరకు కొనసాగించారు. కార్డులు చేతికి వచ్చే సమయానికి పంట పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద రైతులు అప్పు తెచ్చుకుంటున్నారు. భూయజమాని అంగీకారం లేకపోవడంతో ఈ-క్రాప్‌లోనూ కౌలు రైతుల పేర్లు నమోదు కావడం లేదు. దీంతో పంటలు దెబ్బతిన్నప్పుడు పెట్టుబడి రాయితీ, పంటల బీమా కూడా అందుకోలేకపోతున్నారు. సాగుదారు హక్కు కార్డులు లేక కౌలుదార్లకు పెట్టుబడి రాయితీ దక్కడం లేదు.

YSRCP Government Cheating Tenant Farmers: ఇచ్చిన హామీలపై చేతులెత్తేసిన సీఎం జగన్‌.. పంట రుణాలు దక్కడం లేదని కౌలురైతుల ఆవేదన

Farmers Suicides in AP : రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 1,965 కోట్ల పెట్టుబడి రాయితీ ఇచ్చారు. ఇందులో 300 కోట్లు కూడా కౌలు రైతులకు దక్కలేదు. 2019 - 20లో 6వేల 331 మంది, 2020 - 21లో లక్షా 38 వేల మంది, 2021 - 22లో 69వేల మందికే పెట్టుబడి రాయితీ జమైంది. పంట నష్టానికి ఇచ్చే బీమా కూడా కనీసం 5 శాతం మంది కౌలు రైతులకూ దక్కడం లేదు. 6వేల 684 కోట్ల పంటల బీమా ఇచ్చామంటున్న సర్కారు అందులో కౌలు రైతులకు 600 కోట్లు కూడా ఇవ్వలేదు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం మాటలకే పరిమితమైంది. కార్డులు లేవంటూ పరిహారం తిరస్కరిస్తున్నారు.

Crop Loans to Tenant Farmers in Andhra Pradesh :పంట రుణాల్లోనూ కౌలు రైతుల వాటా శూన్యమే. 2018 – 19లో 4 వేల 266 కోట్ల పంట రుణాలు ఇవ్వగా వైఎస్సార్సీపీ వచ్చాక అది కాస్త తగ్గిపోయింది. గతేడాది కేవలం 15 వందల 66 కోట్లు మాత్రమే కౌలు రైతులకు పంట రుణాలు అందాయి. అంటే వంద శాతం ప్రైవేటు పెట్టుబడులపైనే రైతులు ఆధారపడాల్సిన నిస్సహాయ స్థితి.

Tenant farmers Problems: సమస్యలన్నీ పరిష్కరిస్తానన్న జగన్​.. మాపై చిన్నచూపు ఎందుకంటున్న కౌలు రైతులు

ABOUT THE AUTHOR

...view details