ETV Bharat / state

యాప్ పేరుతో కొందరికే విత్తనాలు..! అది కూడా మార్కెట్ ధరకే ఇస్తూ.. రాయితీ అంటున్నారు!

author img

By

Published : Apr 1, 2023, 7:14 PM IST

AP Subsidy Seed: గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం రైతులకు రాయితీపై అందిస్తున్న విత్తనాల సబ్సిడీ పరిమాణం, సబ్సిడీ అందుకుంటున్న లబ్దిదారుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల, కరవు కాటకాల వల్ల పంట నష్టపోయిన రైతులకు 80శాతం రాయితీ ఇచ్చి విత్తనాలను అందిస్తున్నామని ప్రభుత్వ గొప్పగా చెప్తోంది. కానీ, వాస్తవాలను గమనిస్తే మాత్రం వైసీపీ ప్రభుత్వం ఊదరగోడుతున్న తత్వం బయటపడుతుంది.

Subsidy Seeds
సబ్సిడీ విత్తనాలు

AP Subsidy Seed : గడిచిన మూడు సంవత్సరాల్లో తుపాన్లు, అధిక వర్షాలు, వరదలు, సమయానికి వర్షాలు కురవకపోవడం వంటివి.. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీశాయి. ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయిన వారికి 80శాతం రాయితీ ఇచ్చి విత్తనాలు అందజేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. అయితే వాస్తవ లెక్కలు గమనిస్తే మాత్రం ఏడాదికేడాది రైతులకు అందజేస్తున్న విత్తనాల సబ్సిడీ శాతం తగ్గుతోంది. రైతుల ప్రభుత్వం అని వైసీపీ ఊదరగొడుతున్న.. వాస్తవ లెక్కలు మాత్రం వాస్తవానికి భిన్నంగా ఉన్నాయి.

ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందజేస్తున్న లబ్ధిదారుల సంఖ్య ఏడాదికేడాది తగ్గుతోంది. విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో డి-కర్షక్ యాప్ ద్వారా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. భూమి రికార్డులు పక్కాగా ఉన్న వారికే ఈ యాప్ ద్వారా విత్తానాలను అందిస్తున్నారు. రికార్డులు సరిగాలేని రైతులు, కౌలు రైతులకు రాయితీ విత్తనాలు అందడం లేదు. సీసీఆర్సీ ఉన్న కౌలుదారులకు విత్తనాలిస్తున్నా.. అలా ఉన్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.

2020-21 సంవత్సరంలో ఖరీఫ్, రబీ కలుపుకుని 8లక్షల 41వేల క్వింటాళ్ల విత్తనాలను.. 16లక్షల 10 వేల మంది రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. అందుకోసం సుమారు 216 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 2021-22లో 10లక్షల 9వేల క్వింటాళ్ల విత్తనాలను 16లక్షల 37వేల మంది రైతులకి ప్రభుత్వం రాయితి కింద అందించింది. దీని కోసం సుమారు 265.31 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ 2021-22 సంవత్సరంలో నివార్ తుఫాన్ కారణంగా రైతులు పంటలను నష్టపోయారు. నష్ట నివారణలో భాగంగా రబీ సీజన్​లో కొంత సబ్సిడీ పెంచి విత్తనాలను రైతులకి ప్రభుత్వం అందజేసింది. రబీలో కొత్తగా విత్తనాల కోసం నమోదు చేసుకున్న లబ్ధిదారులు 20 వేల మంది రైతులు కాగా.. ఖరీఫ్ సీజన్​కి వచ్చే సరికి మాత్రం సుమారు 2లక్షల 80వేల మంది విత్తన లబ్ధిదారులు తగ్గిపోయారు.

2022- 2023లో రబీ, ఖరీఫ్ రెండు సీజన్లు కలుపుకొని 6లక్షల 85వేల లక్షల క్వింటాళ్ల విత్తనాలను.. 11 లక్షల 92 వేల మంది రైతులకి పంపిణీ చేశారు. దీనికోసం సుమారు 189 కోట్ల 71లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కిందటి సంవత్సరంతో పోలిస్తే.. ఈ సంవత్సరం 80వేల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ తగ్గింది. అంతేకాకుండా సుమారు 4లక్షల మంది విత్తన లబ్ధిదారులూ తగ్గారు. పేరుకి ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు ఇస్తున్నా.. బయట మార్కెట్లో అదే ధరకు అటుఇటూగా విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటున్నాయి. రైతుల నుంచి విత్తనాల సేకరణలో అవినీతి, అక్రమాల కారణంగా నాసిరకం విత్తనాలు రైతులకి ఇస్తున్నారు. ధర నిర్ణయంలోనూ సంబంధిత అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. దీంతో రైతులు సబ్సిడీ విత్తనాలపట్ల ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయము గిట్టుబాటు కాకపోవడం, ప్రభుత్వం అందించాల్సిన సబ్సిడీ సక్రమంగా అందకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

ప్రస్తుతం రైతులకు అందజేస్తున్న రాయితీ విత్తనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల కింద రైతులకు పంపిణీ చేస్తున్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్, పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సాహం, ఇటువంటి పథకాల కింద ప్రభుత్వాలు మ్యాచింగ్ గ్రాంట్లతో రైతులకు సబ్సిడీ విత్తనాలిస్తున్నారు. నిర్ణయిస్తున్న సబ్సిడీ కొన్ని పంటలకే 50 శాతం కాగా.. మరి కొన్ని పంటలకు మాత్రం అంత కంటే తక్కువ రాయితీనే ఇస్తున్నారు. విపత్తుల వంటి ప్రత్యేక సమయాల్లో మాత్రం 80 శాతం వరకు రాయితీ అందిస్తున్నారు. ఆ సబ్సిడీ మీద అందజేసే విత్తనాలు పరిమిత సంఖ్యలో ఉంటున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ విత్తనాల్లో వేరుశనగ 70 శాతం వరకు ఉంటోంది. రైతులకు కావాల్సిన స్థాయి కంటే.. ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాల స్థాయి తక్కువగా ఉందని.. సరిపడా విత్తానాలు అందించటం లేదని రైతులు వాపోతున్నారు.

"ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విత్తనాలు సరిగా అందటం లేదు. అందిన విత్తనాలలో నకిలీ విత్తనాలు ఉంటున్నాయి. రేట్లు కూడా పెంచారు. రైతులకు ఏది అందుబాటులో ఉంచటం లేదు. వర్షానికి పట్టాలు పంచటం లేదు. కోసిన పంటలు వానలకు తడిసి నష్టపోతున్నాము. " -రైతు

"తొలకరి ప్రారంభమయ్యే ముందు ఏ విత్తనం అందుబాటులో ఉండటం లేదు. కనీసం పొలంలో చల్లటానికి పిల్లిపెసర విత్తనాలు కూడా అందుబాటులో లేవు. అఫీసులకు వెళ్తే అధికారులు ఉండటం లేదు." -రైతు

ఏడాదికేడాది తగ్గుతున్న రాయితీ విత్తనాల లబ్ధిదారుల సంఖ్య

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.