ETV Bharat / state

కౌలు రైతు గోడు ప్రభుత్వానికి పట్టదా? సాగునీరు లేక బ్యాంకు రుణాలు రాక అవస్థలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2023, 1:22 PM IST

Updated : Nov 1, 2023, 3:35 PM IST

Tenant Farmers Problems Due to No Identification Card: ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సాగునీరు లేక.. పెట్టిన పెట్టుబడి వస్తుందో లేదో తెలియక ఆర్థికంగా నలిగిపోతున్నారు. రాష్ట్రం మొత్తం సాగు భూమిలో సగం వరకు కౌలు రైతులే సాగు చేస్తున్నారు. వీరిలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన, భూమిలేని నిరుపేదలే అధికంగా ఉన్నారు. ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వక, బ్యాంకులు రుణాలు సైతం అందక వీరంతా ఇబ్బంది పడుతున్నారు.

Tenant_Farmers_Problems_due_to_No_Identification_Card
Tenant_Farmers_Problems_due_to_No_Identification_Card

కౌలు రైతు గోడు ప్రభుత్వానికి పట్టదా? సాగునీరు లేక బ్యాంకు రుణాలు రాక రైతుల అవస్థలు

Tenant Farmers Problems Due to No Identification Card : రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉన్నారని అంచనా. వీరిలో కనీసం సగం మందికి నేటికీ ప్రభుత్వం కౌలు గుర్తింపు కార్డులు (Tenant Farmers Identification Card) ఇవ్వలేదు. దీంతో బయట అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోలేక.. బ్యాంకు నుంచి రుణాలు పొందలేక రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి తోడు, ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వం గుర్తింపు కార్డులు అందించక.. బ్యాంకులు సకాలంలో రుణాలు ఇవ్వక.. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గుర్తింపు కార్డులు ఉన్నా షరతులు విధిస్తూ రుణాల మంజూరులో జాప్యం చేస్తూ బ్యాంకులు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని రైతులు (Tenant Farmers Problems) వాపోతున్నారు.

YSRCP Government Cheating Tenant Farmers: ఇచ్చిన హామీలపై చేతులెత్తేసిన సీఎం జగన్‌.. పంట రుణాలు దక్కడం లేదని కౌలురైతుల ఆవేదన

Identity Cards for Only 8 Lakh Tenant Farmer : రాష్ట్రంలోని కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇస్తానని, ఆర్థికంగా కౌలు రైతు కుటుంబాలను ఆదుకుంటానని సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 లక్షల మందికి మాత్రమే గుర్తింపు కార్డులు మంజూరు చేసింది. అందులో కేవలం లక్షన్నర మందికి మాత్రమే రుణాలు మంజూరు చేసింది. భూయజమాని సంతకం ఉంటేనే కౌలు రైతులకు రుణాలు మంజూరు చేస్తామని చెప్పడంతో.. భూయజమానులు అనేక అపోహలు, భయాలతో సంతకాలు చేయడం లేదని కౌలు రైతులు (Tenant Farmers) వాపోతున్నారు. కౌలు రైతుల రుణాలకు భూయజమానుల సంతకం తప్పనిసరి చేయడం సరైంది కాదంటున్నారు.

No Use For Rythu Bharosa Centres in Andhra Pradesh : రైతులకు సహకారం అందించేందుకంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలు సైతం కౌలు రైతుల పాలిట శాపంగా మారాయి. కౌలు గుర్తింపు కార్డులు లేని రైతు.. పంటను అమ్ముకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంటను అమ్ముకోలేక, పెట్టిన పెట్టుబడి రాక.. నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల సాయంతో కౌలు రైతుల్ని గుర్తించి గుర్తింపు కార్డులు మంజూరు చేయడంతో పాటు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కౌలు రైతు సంఘాలు, రైతులు కోరుతున్నారు.

6.25 శాతం కౌలు రైతులకే సాయం.. మిగిలిన వారి పరిస్థితి ఏంటి..?

కౌలు రైతు సంఘం ప్రతినిధులు ఆవేదన : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇప్పటి వరకు ప్రభుత్వాలు సుమారు 70 కమిషన్లు వ్యవసాయ రంగంపై ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఐనప్పటికీ నేటికీ కౌలు రైతుల రక్షణ కోసం ప్రభుత్వం చెప్పుకోదగ్గ చర్యలు ఏమీ చేపట్టలేదని కౌలు రైతు సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"కౌలు రైతుల పంటలకు నీరు అందక పంట ఎండిపోతుంది. మోటార్ల ద్వారా నీరు అందించడానికి గంటకు 250 రూపాయలు తీసుకుంటున్నారు. ఎకర తడవడానికి 7 గంటల సమయం పడుతోంది. ఈ విధంగా డబ్బులన్నీ పెట్టుబడులు, నీరు కోసమే పోతున్నాయి. ఎక్కువ మొత్తంలో డబ్బులు అవుతున్నాయి. కౌలు గుర్తింపు కార్డులు అందక, బ్యాంకులో లోన్​లు ఇవ్వక కౌలు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నాం."- కౌలు రైతులు

Koulu Raithula Padayatra: "కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి"

Last Updated :Nov 1, 2023, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.