ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వ్యవసాయ మోటార్లకు మీటర్లు వద్దు: తెదేపా

By

Published : Oct 5, 2020, 2:17 PM IST

కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పొన్నవరంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లను వ్యతిరేకిస్తూ తెదేపా నిరసన చేపట్టింది. మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలు నిరసనలో పాల్గొన్నారు.

tdp  protest against farm motors
వ్యవసాయ మోటర్లకు వ్యతిరేకంగా తెదేపా నిరసన

కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పొన్నవరంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు వద్దంటూ రైతులతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అప్పులు చేయడం కోసం రాష్ట్రాన్ని, రైతులను తాకట్టుపెడుతున్నారని ఉమ విమర్శించారు. నాలుగు వేల కోట్ల కోసం రైతుల మెడలకు ఉరితాళ్లు బిగిస్తారా అని ప్రశ్నించారు.

మీటర్లు లేకుండానే గత తెదేపా హయాంలో రైతులకు పగటిపూట నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చామని దేవినేని ఉమ గుర్తు చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కార్యక్రమాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ఈనెల 8న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా

ABOUT THE AUTHOR

...view details