ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయవాడ ఆసుపత్రికి చేరిన కరోనా బాధిత వృద్ధురాలు

By

Published : Jul 14, 2020, 11:02 PM IST

జగ్గయ్యపేటకు చెందిన కరోనా బాధిత వృద్ధురాలి విషయంలో విజయవాడ ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తనను.. బాధిత కుటుంబీకులు ఖండించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. వారికి నచ్చజెప్పిన అధికారులు.. బాదితురాలిని ఆసుపత్రికి తరలించారు.

Relatives complain of negligence on the part of government doctors towards a corona-infected old woman
కరోనా సోకిన వృద్ధురాలి పట్ల ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం- చర్యలు తీసుకోవాలని బంధువుల ఫిర్యాదు

జగ్గయ్యపేటలో 65 సంవత్సరాలు పైబడిన ఓ వృద్ధురాలికి కరోనా సోకగా.. విజయవాడలో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లింది. అక్కడ పడకలు లేవని సిబ్బంది చెప్పగా.. ఆమె ఆర్టీసీ బస్సులో ఇంటికి వెళ్లింది. ఈ ఘటనపై.. బాధిత కుటుంబీకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మళ్లీ విజయవాడ ఆసుపత్రికి తీసుకువెళ్తామన్న సిబ్బంది తీరును తప్పుబట్టారు. వృద్ధురాలని కూడా చూడకుండా.. కరోనా బాధితురాలి విషయంలో ఇంత నిర్లక్ష్యం పనికిరాదన్నారు. స్పందించిన తహసీల్దార్ రామకృష్ణ, ఎస్సై ధర్మరాజు.. బాధిత కుటుంబంతో 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రోగిని విజయవాడ క్వారంటైన్ కు తరలించారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details