ETV Bharat / state

కరోనా బాధితురాలు.. ఆసుపత్రిలో పడకలు లేవని బస్సులో ఇంటికెళ్లింది!

author img

By

Published : Jul 14, 2020, 6:32 PM IST

Updated : Jul 14, 2020, 6:43 PM IST

కరోనా సోకిన వృద్ధురాలు.. విజయవాడ ఆసుపత్రిలో పడకలు లేవని.. బస్సులో ఇంటికి వెళ్లిపోయింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఆ వృద్ధురాలి కుటుంబీకులు.. వైద్యుల తీరుపై ఆగ్రహించారు.

corona cases at jaggaiyyapeta
బస్సులో ఇంటికొచ్చిన కరోనా సోకిన వృద్ధురాలు

కరోనా భాధితులకు చికిత్స అందించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కరోనా నిర్ధరణ అయిన వృద్ధురాలి విషయంలో జరగరాని ఘటనే జరిగింది. ఈ నెల 6న స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్ష చేయించుకున్న 65 ఏళ్ళ మహిళకు 12న పాజిటివ్ అని సంక్షిప్త సందేశం వెళ్లింది. కలెక్టర్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి.. ఆమెను విజయవాడ తరలించాలని 4 సార్లు ఫోన్ చేశారు. సోమవారం సాయంత్రం 108 వాహనంలో విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

తీరా.. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆసుపత్రిలో పడకలు ఖాళీ లేవంటున్నారని, హోమ్ ఐసోలేషన్లో ఉండమన్నారని బాధితురాలు.. తన కుమారుడికి ఫోన్ చేసింది. రాత్రంతా అక్కడ వరండాలో పడుకొని ఉదయం ఆటోలో బస్టాండ్ కి వచ్చి ఆర్టీసీ బస్సులో జగ్గయ్యపేట చేరుకుంది. ఇది తెలుసుకున్న ఆయా ప్రాంత ప్రజలంతా.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

అయితే... అధికారుల వివరణ మాత్రం భిన్నంగా ఉంది. పడకను కేటాయిస్తామని.. కాస్త వేచి ఉండాలని చెప్పినా ఆమె వెళ్లిపోయిందని వైద్యులు చెబుతున్నట్టు కమిషనర్ అన్నారు. అసలు తరలింపు ప్రక్రియ తన దృష్టిలో లేదని తహసీల్దార్ తెలిపారు. ఆమెను మళ్లీ విజయవాడ తరలిస్తామంటూ సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎం వచ్చి అడగ్గా.. ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ... కారణం ఇదే..!

Last Updated : Jul 14, 2020, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.