ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పి. గన్నవరం మండల పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు విజయం - అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు కైవసం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2023, 5:11 PM IST

TDP-Janasena Parties Win By Mandal Parishad Elections: కోనసీమ జిల్లా పి.గన్నవరంలో జరిగిన మండల పరిషత్‌ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఘన విజయం సాధించాయి. అధ్యక్ష పదవిని జనసేన, ఉపాధ్యక్ష పదవిని తెలుగుదేశం పార్టీలు కైవసం చేసుకున్నాయి.

TDP_janasena_Parties_Win_Mandal_Parishad_Elections
TDP_janasena_Parties_Win_Mandal_Parishad_Elections

మండల పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు విజయం- అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు కైవసం

TDP-Janasena Parties Win By Mandal Parishad Elections:ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం-జనసేన పార్టీల నేతలు సమన్వయంగా దూసుకుపోతున్నారు. వైఎస్సార్సీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో కోనసీమ జిల్లా పి. గన్నవరంలో జరిగిన మండల పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు విజయం సాధించి.. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకున్నాయి.

P.Gannavaram Mandal Parishad Election Updates: కోనసీమ జిల్లా పి.గన్నవరం మండల పరిషత్‌ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు విజయం సాధించాయి. అధ్యక్ష పదవిని జనసేన, ఉపాధ్యక్ష పదవిని తెలుగుదేశం కైవసం చేసుకున్నాయి. అధికారికంగా పొత్తు ప్రకటించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావటంతో.. పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి.

Nara Bhuvaneshwari Comments: 'వైసీపీది ధన బలం- టీడీపీది ప్రజా బలం.. 2024లో టీడీపీ-జనసేన అఖండ విజయం'

TDP-Janasena Parties Win: రెండు సంవత్సరాల క్రితం జరిగిన పరిషత్తు ఎన్నికలలో ఈ రెండు (టీడీపీ-జనసేన) పార్టీలు పరస్పర అవగాహనతో పోటీ చేశాయి. మొదటి రెండు సంవత్సరాలు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీలు అనుభవించారు. జెంటిల్మెన్ ఒప్పందం ముగియడంతో వారు..ఆ పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఎన్నికల్లో జనసేనకు చెందిన గని శెట్టి నాగలక్ష్మి ఎంపీపీ (M.P.P.)గా గెలుపొందగా.. తెలుగుదేశంకు చెందిన చెల్లుబోయిన గంగాదేవి మండల పరిషత్ రెండవ ఉపాధ్యక్షురాలుగా విజయం సాధించారు.

TDP-JanaSena Candidates Comments: మండల పరిషత్‌ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్ధులు మీడియాతో మాట్లాడుతూ..''తెలుగుదేశం-జనసేన పార్టీలు అధికారికంగా పొత్తు ప్రకటించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు విజయం సాధించాయి. మండల పరిషత్ అధ్యక్ష పదవిని, ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడాటీడీపీ-జనసేన పార్టీలు తప్పక విజయం సాధిస్తాయి. మళ్లీ ఈ రాష్ట్రానికి, ప్రజలకు మంచి రోజులు వస్తాయి'' అని గనిశెట్టి నాగలక్ష్మి, చెల్లుబోయిన గంగాదేవిలు అన్నారు.

ఉమ్మడి మేనిఫెస్టో, 100 రోజుల ప్రణాళిక దిశగా టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం

Privious Mandal Parishad Elections: గతంలో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లోనూ టీడీపీ-జనసేన పార్టీలు కలిసే పోటీ చేశాయి. అప్పటికీ ఇంకా రాష్ట్ర స్థాయిలో పొత్తులు ఖరారు కాలేదు. అయినప్పటికీ ఈ రెండు పార్టీలు ఇక్కడ పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లి, ఘన విజయం సాధించాయి. మొత్తం 22 ఎంపీటీసీ స్థానాలకు గాను.. తెలుగుదేశం పార్టీ ఏడు, జనసేన ఐదు స్థానాలను కైవసం చేసుకున్నాయి. వీటితో పాటు టీడీపీ-జనసేనలు బలపరిచిన బహుజన సమాజ్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించాయి.

Concluded Gentlemen Agreement: ఈ నేపథ్యంలో మొదటి, రెండు సంవత్సరాలు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీలు అనుభవించారు. తాజాగా జెంటిల్మెన్ ఒప్పందం ముగియడంతో వారు పదవులకు రాజీనామా చేశారు. దీంతో మళ్లీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు తాజాగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు విజయం సాధించాయి.

'కరవు కనిపిస్తున్నా అంతా బాగుందనడం పచ్చి అబద్ధం - ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఐక్య పోరాటం'

ABOUT THE AUTHOR

...view details