ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"ఎమ్మెల్యేలకు ఎర కేసు".. సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశం

By

Published : Dec 26, 2022, 4:17 PM IST

Updated : Dec 26, 2022, 4:57 PM IST

MLAS CASE AT CBI
MLAS CASE AT CBI

16:13 December 26

సిట్ దర్యాప్తు పట్ల నమ్మకం లేదని హైకోర్టులో నిందితుల పిటిషన్

MLAs Baiting Case Transferred To CBI : తెలంగాణలో సంచలనం సృష్టించిన "ఎమ్మెల్యేలకు ఎర కేసు" దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తు పట్ల నమ్మకం లేదని బీజేపీ, నిందితులు దాఖలు పిటిషన్‌లను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేసును సీబీఐకి అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని సిట్‌ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో పురోగతి ఉన్నందున సిట్‌తో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. అయితే, అడ్వకేట్‌ జనరల్‌ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది.

సిట్‌ దర్యాప్తు సరిగా జరగలేదని బీజేపీ తరఫున న్యాయవాది రామచందర్‌రావు ఆరోపించారు. కేసులో సాంకేతిక అంశాలను పట్టించుకోలేదన్నారు. రాజకీయంగా వేధిస్తున్నారని కోర్టుకు వివరించినట్లు తెలిపారు. సంబంధం లేకున్నా.. బీజేపీ పేరు ప్రస్తావించారని తెలిపారు. రాజకీయ దురుద్దేశాలతోనే కేసు పెట్టారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్​ ప్రెస్‌మీట్‌ పెట్టి విమర్శలు చేశారని.. అనిశాకు తప్ప సిట్‌కు విచారణ అధికారం లేదు అని రామచందర్‌రావు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 26, 2022, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details