ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జనం.. మా జీవితాలకు జగనే విలన్‌‌నని అంటున్నారు: కొమ్మారెడ్డి పట్టాభిరామ్

By

Published : Apr 11, 2023, 3:29 PM IST

TDP spokesperson Pattabhi Ram Fire on CM Jagan: విద్యుత్ వినియోగదారులపై రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.5వేల 500కోట్ల భారం మోపుతుందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. ఈనెల నుంచి యూనిట్‌పై అదనంగా రూ. 90పైసలు బాదుతున్నారని విమర్శించారు. ఈ రకంగా ఛార్జీల భారం మోపుతున్న జగన్‌ను..'మా నమ్మకం నువ్వే జగన్‌' అని కాకుండా.. 'మా జీవితాలకు నువ్వే విలన్‌' అని జనం అనుకుంటున్నారని పట్టాభిరామ్ మండిపడ్డారు.

TDP
TDP

జనం.. మా జీవితాలకు జగనే విలన్‌‌నని అంటున్నారు

TDP spokesperson Pattabhi Ram Fire on CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగానికి సంబంధించి.. ఏపీఈఆర్సీ చట్టంలో కొన్ని సవరణలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్బంగా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ.. ''విచ్చలవిడిగా వైసీపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విద్యుత్‌ కొంటున్నారు. అధిక ధరల భారాన్ని వినియోగదారులపై మోపుతున్నారు. ఏపీఈఆర్‌సీ చట్టంలో సవరణలు చేసి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. చట్టాలను కూడా సవరించేసి గెజిట్‌ నోటిఫికేషన్లు ఇచ్చి బాదేస్తున్నారు. ఏడాది దాకా ఆగడమెందుకు నెలకే వసూలు చేయాలని బాదేస్తున్నారు. యూనిట్‌కు 90 పైసలు చొప్పున వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. వినియోగదారులపై మొత్తంగా ఈ ఆర్థిక ఏడాదిలో రూ.5,500 కోట్లు భారం పడుతుంది. నెలకు రూ.460 కోట్ల అదనపు భారం మోపబోతున్నారు. ఈ రకంగా ఛార్జీల భారం మోపుతుంటే 'మా నమ్మకం నువ్వే జగన్‌' అనాలా? లేక 'మా జీవితాలకు నువ్వే విలన్‌' అని జనం అనుకుంటున్నారు.

అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తూ.. వచ్చిన నష్టాన్ని వినియోగదారులపై మోపుతున్నారు. రూ.3.082 కోట్ల వసూలుకు రంగం సిద్ధం చేసి ఛార్జీలు పెంచేశారు. ఏ నెలకు ఆ నెల బాధాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ వినియోగం పరంగా జగన్ ప్రభుత్వం ప్రతి సామాన్యుడి నడ్డి విరుస్తుంది. ఓవైపు పన్నులు పెంచుతూ, మరోవైపు ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నా కూడా ప్రతి సామాన్యుడు వారి ఇంటి బయట 'నా నమ్మకం నువ్వే జగన్- నా భవిష్యత్ నువ్వే జగన్' అనే స్టిక్కర్లు అంటించుకోవాలా..?, ఇలా అన్నింటిని పెంచుకుంటూపోతే స్టిక్కర్లు ఎలా అతికించుకుంటారు సార్?. ఏ రకంగా ఈ విద్యుత్ ఛార్జీలను పెంచారో.. రాష్ట్ర ప్రజలకు తెలిజెప్పాలి.'' అని ఆయన అన్నారు.

అనంతరం వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 5,500 కోట్లు భారం మోపిందని పట్టాభి రామ్‌ ధ్వజమెత్తారు. ఈ నెల నుంచి ప్రతి నెలకు రూ.460 కోట్ల అదనపు భారం మోపబోతున్నారని ఆరోపించారు. 'మా జీవితాలకు జగనే విలన్‌' అని జనం అనుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై.. ఈ ఏడాది రూ. 5 వేల 500కోట్ల భారాన్ని ఎలా మోపుతున్నారో.. ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరాలను వెల్లడించాలని తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని పట్టాభి వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details