ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆస్తుల పంపిణీపై ఏపీ ప్రభుత్వం పిటిషన్‌.. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు

By

Published : Jan 9, 2023, 2:18 PM IST

SC ON GOVT PETITION ON STATE BIFURCATION
SC ON GOVT PETITION ON STATE BIFURCATION

SC ON GOVT PETITION ON STATE BIFURCATION : రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపిణీపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు తెలంగాణ, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు హాజరుకాలేదు. ఇరువురికి నోటీసులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం.. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

SC ON AP GOVT PETITION : విభజన తర్వాత ఆస్తుల పంపిణీపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషిన్‌పై విచారణను సుప్రీంకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది. ఆస్తుల విభజన సరిగా జరగకపోవడం వల్ల ఆర్థికంగా నష్టపోయామని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఆస్తుల విభజన న్యాయబద్ధంగా జరిపేలా ఆదేశాలివ్వాలని కోరింది. అయితే పిటిషన్‌పై విచారణకు తెలంగాణతో పాటు.. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు హాజరుకాలేదు. వీరికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటర్‌పై రీజాయిండర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించిన సుప్రీంకోర్టు..విచారణను వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details