ETV Bharat / state

భువనేశ్వరితో చంద్రబాబు విదేశీ పర్యటన - వారం రోజుల పాటు అమెరికాలోనే - Chandrababu foreign Tour

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 19, 2024, 12:52 PM IST

TDP Chief Chandrababu Naidu Foreign Tour: తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లారు. చంద్రబాబు వారం రోజుల పాటు అమెరికాలో ఉండనున్నారు.

TDP Chief Chandrababu Naidu Foreign Tour
TDP Chief Chandrababu Naidu Foreign Tour (ETV Bharat)

TDP Chief Chandrababu Naidu Foreign Tour : గత రెండు నెలలుగా రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ వేసవి కాలంలో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల వేడి తారాస్థాయికి తీసుకెళ్లారు. క్షణం తీరికలేకుండా ప్రజలతో మమేకమయ్యారు. ఎట్టకేలకు ఈ నెల 13న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ముగియడంతో కాస్త కుదుట పడ్డారు. అభ్యర్థులు భవిష్యత్తు జూన్ 4న తెలియనుంది. ప్రస్తుతానికి పోలింగ్ ముగియటంతో రాజకీయ విశ్రాంతి తీసుకుంటున్నారు. కౌటింగ్ వరకు సమయం ఉండటంతో వివిధ పార్టీల అగ్రనేతలు వారి కుటుంబ సభ్యులతో గడిపేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి కోర్టు అనుమతితో కుటుంబ సభ్యులతో లండన్ పర్యటనకు వెళ్లారు.

Chandrababu went America : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి అమెరికాకు పయనమయ్యారు. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి బయలుదేరి అమెరికాకు వెళ్లారు. వారం రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 16నే అమెరికాకు వెళ్లారు.

విదేశీ పర్యటనకు సీఎం జగన్​- వీడ్కోలు పలికిన పార్టీ నేతలు - Cm Jagan tour

విదేశాలకు జగన్- ఎన్నికల ఫలితాల వరకూ అక్కడే! - Jagan abroad tour

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.