ETV Bharat / politics

విదేశాలకు జగన్- ఎన్నికల ఫలితాల వరకూ అక్కడే! - Jagan abroad tour

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 5:12 PM IST

Updated : May 14, 2024, 6:42 PM IST

JAGAN ABROAD TOUR : సీఎం జగన్​ విదేశీ పర్యటనకు అనుమతి లభించింది. ఈ నెల 16 నుంచి జూన్​ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. పర్యటనలో భాగంగా జగన్​ యూకే, స్విస్​, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించనున్నట్లు సమాచారం.

jagan_abroad_tour
jagan_abroad_tour (Etv Bharat)

JAGAN ABROAD TOUR : సీఎం జగన్​ విదేశీ పర్యటనకు అనుమతి లభించింది. ఈ నెల 16 నుంచి జూన్​ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. పర్యటనలో భాగంగా జగన్​ యూకే, స్విస్​, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించనున్నట్లు సమాచారం.

ప్యాలెస్‌లలో మీరు - పిచ్చుక గూళ్లో పేదలు - ఇప్పుడు చెప్పు జగన్ పెత్తందారు ఎవరో? - CM Jagan Irregularities

ఏపీ సీఎం జగన్ విదేశాలకు వెళ్లనున్నారు. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో 17 రోజులు కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించేందుకు న్యాయస్థానం సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ కు 2013లో బెయిల్ ఇచ్చిప్పుడు దేశం విడిచి వెళ్లరాదని సీబీఐ కోర్టు షరతు విధించింది. ఫ్యామిలి వెకేషన్ కోసం భార్య భారతి, కుమార్తెతో కలిసి యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును జగన్ కోరారు. కేసు అభియోగాల నమోదు దశలోనే ఉన్నందున తాను విదేశాలకు వెళ్తే ట్రయల్ పై ప్రభావం ఉండదని కోర్టుకు తెలిపారు.

జగన్‌ హయాంలో అరాచకాలకు అడ్డాగా ఆంధ్రా - విధ్వంసపు పాలనలో మానని గాయాలెన్నో! - YSRCP Govt Anarchies in AP

కోర్టు ఎలాంటి షరతులు విధించినా పాటిస్తానని, విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. గతంలోనూ కోర్టు అనుమతితో పలు మార్లు విదేశాలకు వెళ్లి వచ్చినట్లు వివరించారు. జగన్ అభ్యర్థనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్, ఇతర నిందితులు కుంభకోణానికి పాల్పడి ఆర్థికంగా అక్రమ లబ్ధి పొందారని సీబీఐ వాదించింది. ఏదో ఒక కారణంతో జగన్ తరచుగా విదేశాలకు వెళ్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చింది. జగన్ సీఎం అయిన తర్వాత ఒకే సారి కోర్టుకు వచ్చారని వాదించింది. జగన్, ఇతర నిందితులు వివిధ పిటిషన్లు వేసి కేసు విచారణ జాప్యం చేస్తున్నారని గతంలో హైకోర్టు ప్రస్తావించిందని సీబీఐ పేర్కొంది. తీవ్రమైన ఆర్థిక నేరాభియోగాలు ఎదుర్కొంటున్న జగన్ విచారణలో జాప్యాన్ని సాకుగా చూపి.. మినహాయింపులు, సడలింపు కోరడం సరికాదని వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు జగన్ 17 రోజులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. విదేశాలకు వెళ్లే ముందు తన ప్రయాణ వివరాలు, ఫోన్ నంబర్లు, మెయిల్ కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని జగన్ ను న్యాయమూర్తి ఆదేశించారు.

జగన్​కు దారుణ పరాభవం - ఆ మంత్రి గెలిచినా టీడీపీలోకి వెళ్తాడు - పీకే మరో సంచలన ఇంటర్వ్యూ - Prashant kishor on ap elections

Last Updated : May 14, 2024, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.