ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తుపాను ప్రభావంతో నిండామునిగిన మినుము రైతులు- పట్టించుకోని ప్రభుత్వం, ఆర్బీకే అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 7:32 AM IST

Updated : Dec 18, 2023, 11:32 AM IST

Heavy Loss to Farmers Due to Michaung Cyclone Effect: మిగ్‌జాం తుపాను ప్రభావం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులు ఇంకా కోలుకోలేదు. పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని నానా తిప్పలు పడి బయటకు పంపించినా లాభం లేకుండా పోతోందని అపరాల రైతులు వాపోతున్నారు. ఇప్పుడు మళ్లీ పొలాన్ని దమ్ము చేసి మినుము విత్తనాలు వేయాలంటే అధిక భారం పడుతుందని ఆవేదన చెందుతున్నారు.

heavy_loss_to_farmers
heavy_loss_to_farmers

తుపాను ప్రభావంతో నిండామునిగిన మినుము రైతులు- పట్టించుకోని ప్రభుత్వం, ఆర్బీకే అధికారులు

Heavy Loss to Farmers Due to Michaung Cyclone Effect:మిగ్ జాం తుపాన్ నష్టం రైతులను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఖరీఫ్‌లో వరి కోతలు పూర్తైన తర్వాత కృష్ణా జిల్లా రైతులు అధికంగా మినుమును సాగుచేస్తుంటారు. వరి కోతలు ముందే పూర్తైన ప్రాంతాల్లో మినుము విత్తనాలు జల్లుకున్నారు. బస్తాకు 11 నుంచి 12 వేల రూపాయలు వెచ్చించి సాగుకు సిద్ధమయ్యారు. మొక్కలు సైతం అర అడుగు పెరిగాయి. ఈ లోగా వచ్చిన తుపాను మినుమును పూర్తిగా తుడిచిపెట్టేసింది. పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. నానా తిప్పలు పడి వర్షపు నీటిని బయటకు పంపినా మొక్క ఎదుగుదల కనిపించటంలేదని వాపోతున్నారు.

మిగ్​జాం తుపానుతో వేల ఎకరాల్లో కూరగాయల పంటలకు తెగుళ్లు- ప్రభుత్వమే ఆదుకోవాలంటూ అన్నదాతల వేడుకోలు

గతంలో మినుము విత్తనాలు చల్లిన తర్వాత మెక్క ఎపుగా ఎదిగేందుకు పురుగు మందులు కూడా కొట్టామని రైతులు అంటున్నారు. అటూ వరి పంటను కొల్పోయి ఇటూ మినుము పంటను కొల్పోయి తాము సాగులో చాలా నష్టపోయామని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మినుములు క్వింటా 15 వేల నుంచి 16 వేల వరకు ధర చెబుతున్నారని, మళ్లి అన్ని డబ్బులు పెట్టి మినుము విత్తనాలు కొనుగోలు చేయాలంటే తమకు తలకు మించిన భారంగా మారుతుందన్నారు. 15 వేలు ఖర్చు చేసి మినుము విత్తనాలు కొని మళ్లీ కూలీలతో చల్లించాక పురుగుమందులు కూడా కొట్టాల్సి వస్తుందన్నారు. ఈ సంవత్సరం మినుము పంటను రెండు సార్లు వేయాల్సి వస్తుందని వాపోతున్నారు. మినుము పంట పొవడంతో కౌలు రైతుల పరిస్థితి మరింత ఘోరంగా మారంది. ఎందుకంటే వారిలో వచ్చే ఫలసాయం ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చును తీసివేయగా, భూ యాజమానికి కౌలు చెల్లించాలి. మెదటి సాగులో రైతులు మిగిలేది పెద్దగా ఏం ఉండదు. అందుకే కౌలు రైతు రెండవ పంటపైనే ఆశలు పెట్టుకుంటారు.

ధాన్యం కొనుగోలులో రైతులను పీల్చి పిప్పి చేస్తున్న మిల్లర్లు - కళ్లప్పగించి చూస్తోన్న సర్కార్

తుఫాన్ దెబ్బకు ఆ పంట కూడా దెబ్బతినడంతో రైతులు మరింత అవస్థలు పడుతున్నారు. ఇప్పడు అప్పులు చేసి మినుము విత్తనాలు చల్లినా పంట చేతికి వస్తుందన్న నమ్మకం తమకు లేదని రైతులు అంటున్నారు. మరోక రెండు నెలల్లో వేసవి ప్రారంభం అవుతుందని అప్పుడు మినుము మెక్క ఎదిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు చేయత ఇచ్చేందుకు రాయితీపై మినుము విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇవ్వాలని రైతులు అడుగుతున్నారు. వరి పంట ఎలాగో చేతికి రావడం లేదు, రెండవ పంటనైనా బతికించుకుంటే తాము ఆర్దిక కష్టాల నుంచి గట్టెక్కుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొలకెత్తిన వరి పనలు - చేలల్లోనే పంటను దున్నేస్తున్న రైతులు

వరిని తీసేసిన తర్వాత పంట భూమిని అలా ఖాళీగా ఉంచలేక తాము మళ్లీ మినుము సాగును చేయాలని అనుకుంటున్నామని అంటున్నారు. తాము మళ్లీ పొలాన్ని దమ్ము చేసి మినుము విత్తనాలు చల్లుతామని, పంట చేతికి వచ్చేది రానిది దైవ నిర్ణయానికే వదిలేస్తున్నామని పెర్కొన్నారు. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మినుము పంట సాగు చేయాలని ఉన్నా కూడా విత్తనాలకు అధిక రేట్లకు కొనుగోలు చేసేందుకు రైతులు వెనుకడగు వేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు రాయితీపై విత్తనాలు అందించాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు.

Last Updated :Dec 18, 2023, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details