ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీపీఎస్​పై కొత్త అసోసియేషన్​.. రద్దుపై నిర్ణయం కోసం డిమాండ్​

By

Published : Nov 22, 2022, 7:16 PM IST

NEW ASSOCIATION ON CPS ISSUE : పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామని ఎన్నికల వేళ ఇచ్చిన హామీని సీఎం జగన్ అమలు చేయాలని.. ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్‌ నేతలు డిమాండ్ చేశారు. సీపీఎస్ అంశంపై పోరాటం చేసేందుకు ఏపీ సచివాలయ, అసెంబ్లీ ఉద్యోగులు.. ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

NEW ASSOCIATION ON CPS ISSUE
NEW ASSOCIATION ON CPS ISSUE

CPS EMPLOYEES NEW ASSOCIATION : సీపీఎస్ అంశంపై ఏపీ సచివాలయ ఉద్యోగులు కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశారు. సచివాలయం, అసెంబ్లీలోని ఉద్యోగులు అంతా కలిసి ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్​.. ఇప్పటివరకు అమలు చేయలేదని అసోసియేషన్ ఆరోపించింది. ప్రభుత్వ తీరుతో సీపీఎస్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారన్నారు.

సీపీఎస్ విధానాన్ని కూడా ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదన్న నేతలు.. 2022 మార్చి నుంచి ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఖాతాలో జమ కావడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 10శాతం నుంచి 14 శాతానికి పెంచిన.. ప్రభుత్వ వాటా సైతం రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్​ను అంగీకరించేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పామన్నారు. రాజకీయ కారణాలతో అయినా ప్రభుత్వం.. సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని అసోసియేషన్ నేతలు డిమాండ్​ చేశారు.

సీపీఎస్ అంశంపై కొత్త అసోసియేషన్​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details