ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP Emp Association On PRC: 'ఫిట్‌మెంట్​పై అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమే.. కానీ..'

By

Published : Jan 9, 2022, 12:09 PM IST

Updated : Jan 9, 2022, 2:20 PM IST

AP Emp Association On PRC
AP Emp Association On PRC

AP Emp Association On PRC: పీఆర్సీపై అయోమయ సందిగ్ధ స్థితిలో ఉద్యోగ సంఘాలు ఉన్నాయని.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ఫిట్‌మెంట్‌పై అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని తెలిపారు. మూల వేతనం పెరిగినప్పుడే జీతాలు పెరుగుతాయే తప్పా... పాత బకాయిలు కలిపి ఇస్తే ప్రయోజనం ఉండబోదని పేర్కొన్నారు.

AP Emp Association On PRC: రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించిన 23శాతం ఫిట్‌మెంట్‌పై​ ఉద్యోగుల సంఘాల నాయకులు సమ్మతి తెలిపినా... సగటు ఉద్యోగి అసంతృప్తిగా ఉన్నాడని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. తాజా వేతన సవరణ వల్ల ఉద్యోగుల జీతాలు పెరగబోవని తెలిపారు. డీఏ, బకాయిలు కలిపి వచ్చే నెల జీతం ఇస్తునందున పెరుగుదల కనిపిస్తుందేతప్ప జీతాలు పెరగలేదని అన్నారు. మూల వేతనం పెరిగినప్పుడే జీతాలు పెరుగుతాయని, పాత బకాయిలు కలిపి ఇస్తే ప్రయోజనం ఉండబోదని తెలిపారు.

పీఆర్సీ కమిషన్ సిఫార్సులకు భిన్నంగా..

ఈనెల 6న సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో తమ సంఘం తరపున అన్ని అంశాలు నివేదించామని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో ఉన్నందున శుక్రవారం నాటి సమావేశానికి తాము హాజరు కాలేదని పేర్కొన్నారు. పీఆర్సీపై ప్రభుత్వం చేసిన ప్రకటన మేరకు నాలుగు అంశాలను చూసి తాను స్పందిస్తున్నానని... విషయాలు పూర్తిగా తెలియరాలేదని తెలిపారు. గతంలో పీఆర్సీ కమిషన్ చేసిన సిఫార్సుల ప్రకారం 10 నుంచి 15శాతం పెంచి వేతన సవరణ చేసేవారని... దానికి భిన్నంగా ఈసారి జరిగిందన్నారు.

అదనపు ఫించను తొలగించడం దారుణం..

విజయవాడ వచ్చిన ఐఏఎస్ అధికారులకు అద్దె భత్యం కింద రూ. 40వేలు ప్రభుత్వం ఇస్తోందని... అదే సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు 30శాతం కోత విధించాలని నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలవెన్సులు యధాతథంగా కొనసాగించాలన్నారు. వేతన సవరణపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉన్నా... ఇప్పటికిప్పుడు ఆందోళన చేపట్టేందుకు ఉద్యోగ సంఘాలు మానసికంగా సిద్ధంగా లేవన్నారు. సీపీఎస్​పై నిర్ణయం తీసుకోకపోవడం వల్ల లక్షలాది ఉద్యోగుల కుటుంబాలకు భద్రత కొరవడిందని తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేయకపోవడంతో ఈనెల 10 నుంచి వారు ఆందోళనకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. వారికి తమ సంఘం అండగా నిలుస్తుందన్నారు. 70ఏళ్లు దాటిన పింఛనుదారులకు అదనపు ఫించను తొలగించడం దారుణమన్నారు.

ఇదీ చదవండి:EMPLOYEES DEMAND REGULARISATION: సచివాలయాల ఉద్యోగుల షాక్‌

Last Updated :Jan 9, 2022, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details