ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గోదావరికి మళ్లీ వరద... నీట మునిగిన పలు గ్రామాలు

By

Published : Sep 3, 2020, 5:06 PM IST

గోదావరి నదికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట ప్రస్తుత నీటి మట్టం 10.5 అడుగులకు చేరింది. ఈ వరదలతో దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలు ముంపు బారిన పడ్డాయి.

godavari floods in east godavari district
గోదావరికి మళ్లీ వరద

తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి నదిలో ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ధవళేశ్వరం ఆనకట్ట ప్రస్తుత నీటిమట్టం 10.5 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి డెల్టా ప్రధాన కాల్వలకు 12,600 క్యూసెక్కులు, సముద్రంలోకి 8లక్షల 27వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తాజాగా వస్తోన్న వరదలతో దేవీపట్నం మండలంలోని గిరిజన గ్రామాలు ముంపునకు గురయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details