ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగన్‌ను ఇంటికి పంపడమే.. అందరి ధ్యేయం కావాలి : చంద్రబాబు

By

Published : Feb 15, 2023, 8:16 PM IST

Updated : Feb 15, 2023, 8:25 PM IST

CBN East Godavari Tour : జగన్‌ను ఇంటికి సాగనంపేందుకు మహిళలు పోరాడాలని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మూడు రోజుల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటన నేపథ్యంలో చంద్రబాబుకు ప్రజలు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ప్రతి సెంటర్‌లో క్రేన్ ద్వారా భారీ గజమాలలతో.. చంద్రబాబుకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు.

సీబీఎన్
CBN

CBN Comments on Jagan: జగన్‌ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా పర్యటన చేపట్టిన చంద్రబాబు.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు జగ్గంపేటలో పర్యటించారు. చంద్రబాబు పర్యటనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో చంద్రబాబుకు మహిళల హారతులు పట్టగా.. ప్రతి సెంటర్‌లో క్రేన్ ద్వారా భారీ గజమాలలు వేశారు.

బూరుగుపూడి, కోరుకొండ మీదుగా గుమ్మళ్లదొడ్డికి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి జగ్గంపేట నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. సైకో జగన్​ను ఇంటికి పంపేందుకు వీర నారిమణుల్లా మహిళలు పోరాడాలని పిలుపునిచ్చారు. తన బిడ్డకు ఉద్యోగం వచ్చిందని ఏ తల్లైనా చెప్పగలదా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి ఇచ్చే 10 రూపాయలు మాత్రమే కనిపిస్తోంది కానీ దోచుకునే 50 తెలుసుకుంటే వైసీపీ నేతల్ని మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వరన్నారు. ఏమారితే ప్రజల ముఖాలకు కూడా రంగులు వేసే రంగుల పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు.

ప్రజలపై 45 రకాల పన్నులు వేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని మండిపడ్డారు. అంతేకాకుండా సీఎం జగన్ విధానాలతో రాష్ట్రం 30ఏళ్లు వెనక్కిపోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. అనంతరం మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీఆర్‌ చేసిన పనులను గుర్తుచేస్తూ.. అతను మగవారితో ఆడబిడ్డలకు సమాన హక్కు కల్పించారని.. అందుకే ఇప్పుడు మగవారితో సమానంగా ఆడబిడ్డలు రాణిస్తున్నారని తెలిపారు.

సీఎం జగన్ బాదుడే బాదుడు పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని.. జగన్‌ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. అలాగే చెత్తమీద పన్ను వేసిన ఘనత జగన్‌కే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. మన కష్టాలన్నింటికీ కారణం ముఖ్యమంత్రి జగనే అని ఆరోపించారు. జగన్‌ రాజకీయాల్లో.. అధికారంలో ఉండడానికి అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన సమస్యలకు కారణమైన ముఖ్యమంత్రి జగన్‌ను ఇంటికి సాగనంపాలని.. జన్‌ను ఇంటికి పంపడమే అందరి ధ్యేయం కావాలని చెప్పారు.

జగన్‌ను ఇంటికి పంపడమే.. అందరి ధ్యేయం కావాలి : చంద్రబాబు

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుంది. నిర్వాసితులకు సంబంధించి వెయ్యి ఎకరాల పరిహారాన్ని భోగస్ పట్టాలతో వైసీపీ నేతలు కొట్టేస్తున్నారు. దీనిపై తెలుగుదేశం అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ జరిపిస్తుంది. ప్రజాధనాన్ని హారతి కర్పూరంలా మింగేస్తున్నారు. -చంద్రబాబు, తెలుగుదేశం అధినేత

జగన్మోహన్ రెడ్డికి చిన్న మెదడు చితికిపోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజల భూములు సర్వే చేసి.. జగన్ తన బొమ్మలు వేసుకుంటున్నాడని ధ్వజమెత్తారు. వైసీపీ పని అయిపోయిందని.. ఇక గెలిచే అవకాశం లేదని దుయ్యబట్టారు. అలాగే పోలవరం పరిహారం కొట్టేయడంపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా టీడీపీ అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ జరిపిస్తుందని చంద్రబాబు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Feb 15, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details