ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్రకు సర్వ సిద్దం: టీడీపీ నాయకులు

By

Published : Jan 23, 2023, 11:19 AM IST

chittor distric
'యువగళం' పాదయాత్ర ()

'Yuvagalam' Padayatra Latest News: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ 'యువగళం' పేరుతో ఈ నెల 27న కుప్పం నుంచి మహాపాదయాత్రకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 400 రోజుల పాటు ఆయన ప్రజాక్షేత్రంలో పర్యటించి, ప్రజా సమస్యలను తెలుసుకుని.. ఈ పాదయాత్ర ద్వారా వారికి భరోసా కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీడీపీ నాయకులు తెలిపారు.

నారా లోకేశ్‌ 'యువగళం' పాదయాత్రకు సర్వ సిద్దం

'Yuvagalam' Padayatra Latest News: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యర్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో 'యువగళం' పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్రకు సంబంధించి మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, MLC దొరబాబు ఆధ్వర్యంలో కుప్పంలోని పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం పాదయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యర్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న పాదయాత్ర విజవంతం కావాలని ఆకాంక్షిస్తూ.. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని శ్రీఅభయ ఆంజనేయస్వామి వారి ఆలయంలో పార్టీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు.

మరోపక్క నారా లోకేశ్‌ పాతయాత్రకు మద్దతుగా తిరుపతిలో తెలుగు యువత నాయకులు వినూత్న ప్రదర్శన చేపట్టారు. మంగళం రోడ్డులోని ఓ మైదానంలో 'యువగళం' అక్షరాలను మంటలతో ప్రదర్శించారు. లోకేశ్‌ పాదయాత్ర చేపడుతుంటే.. సీఎం జగన్‌కు భయం పట్టుకుందని.. అందుకే యాత్రకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. నారా లోకేశ్​ యువగళం మహాపాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నాయకులు పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ కావడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని గుర్తు చేస్తున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలిన ప్రభుత్వం.. ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను అడ్డుకోజూస్తోందని ధ్వజమెత్తారు. అనుమతులు ఇవ్వొద్దనే ఉద్దేశంతో జవాబులు లేని ప్రశ్నలతో పాదయాత్రకు అడ్డుపడాలని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

ఈ జగన్ మోహన్ రెడ్డి అరాచకాలు, అక్రమాలకు బాధింపబడిన బాధితులను పరామర్శించేందుకు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యర్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 27 నుంచి చిత్తూరు జిల్లా కుప్పంలో 'యువగళం' పేరుతో పాదయాత్రను చేపట్టనున్నారు. విద్యార్ధులు కోసం, కర్షకుల కోసం, మహిళల సమస్యలను తెలుసుకోవటం కోసం ఆయన పాదయాత్ర చేయబోతున్నారు. ఆ పాదయాత్రకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడుతుంది.-రవి నాయుడు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details