ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Mahapadayatra : ఐదవ రోజుకు చేరిన అమరావతి రైతుల మహాపాదయాత్ర...

By

Published : Sep 16, 2022, 11:36 AM IST

Farmers  Mahapadayatra
నేడు ఐదో మహాపాదయాత్ర ()

Farmers Mahapadayatra : రాజధాని రైతులు, ఐకాసా నేతల మహాపాదయాత్ర నేడు ఐదో రోజుకు చేరుకుంది. ఈ రోజు ఉదయం బాపట్ల జిల్లా కొల్లూరు నుంచి రాజధాని రైతుల పాదయాత్ర ఉత్సాహంగా ప్రారంభమయ్యింది. ఓవైపు గత నాలుగు రోజులుగా రాజధాని రైతుల పాదయాత్ర కొనసాగుతుండగా.. మరోవైపు సీఎం జగన్ మూడు రాజధానులపై అసెంబ్లీలో మరోసారి మాట్లాడటంతో రాజధాని రైతులలో ఆందోళన నెలకొంది. అయినా పట్టు విడవకుండా తమ లక్ష్యం వైపు నడుస్తున్నారు రైతులు.

Ongoing fifth day of padayatra : రాజధాని రైతుల పాదయాత్ర ఐదో రోజున బాపట్ల జిల్లా కొల్లూరు నుంచి ఉత్సాహంగా ప్రారంభమయ్యింది. రాజధాని రైతులతో పాటు రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల వారు పాదయాత్రలో పాల్గొన్నారు. రైతులు బస చేసిన కళ్యాణ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర మొదలుపెట్టారు. స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రైతులకు సంఘీభావం తెలిపి వారి వెంట నడిచారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మూడు రాజధానుల అంశాన్ని మరోసారి ప్రస్తావించడంపై రైతులు ఆగ్రహం వెలిబుచ్చారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ ఐకాస నేత పువ్వాడ సుధాకర్‌ నల్ల చొక్కా ధరించి పాదయాత్రలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా.. ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చేలా ఉన్నాయని సుధాకర్‌ అభిప్రాయపడ్డారు. రైతులు అమరావతి కోసం చేస్తున్న పాదయాత్రకు మద్దతివ్వడం తమ కనీస బాధ్యతగా భావించి వారి వెంట నడుస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details