Kodali Nani PA: కొడాలి నాని పీఏ నన్ను వేధిస్తున్నాడు: దళిత మహిళ

author img

By

Published : Sep 16, 2022, 10:07 AM IST

Kodali Nani PA

Kodali Nani PA: ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ తనను వేధిస్తున్నాడని ఓ దళిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో దూషిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే..?

దళిత మహిళ

Kodali Nani PA: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ లక్ష్మోజీ.. తనను వేధిస్తున్నారని అదే ప్రాంతానికి చెందిన వార్డు వాలంటీర్‌ మేరుగు లలిత ఆరోపించారు. దీనిపై ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌తోపాటు పలువురికి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. గురువారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ‘మేం గుడివాడ బాపూజీనగర్‌ 13వ వార్డులో నివసిస్తున్నాం. తిరుపతమ్మ చెరువు గట్టున మున్సిపాలిటీ స్థలంలో ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. మూడు రోజుల క్రితం బోరు వేసేందుకు కూలీలు పని చేస్తుండగా.. రోడ్డు అవతలివైపు ఉన్న రమేష్‌, సురేష్‌ వచ్చి మా సామాన్లు చెల్లాచెదురుగా పడేశారు. నాపై దాడి చేశారు. వాళ్లకు భయపడి అక్కడి నుంచి పారిపోయాను. తర్వాత వారిద్దరితోపాటు సురేష్‌ మామ సుబ్రహ్మణ్యం వచ్చారు. ముగ్గురూ కలిసి నన్ను కులం పేరుతో దూషించి అసభ్యంగా ప్రవర్తించారు. చుట్టుపక్కల వాళ్లు రావడంతో పారిపోయారు. డయల్‌ 100కు ఫోన్‌ చేయగా.. పోలీసులు వచ్చి వివరాలు తీసుకున్నారు. సాయంత్రం సీఐ దుర్గారావు పిలిపించారు. జరిగిందంతా ఆయనకు చెప్పాను. వెంటనే బోరు పనులు ఆపేయాలని, లేకపోతే తిరిగి నీపైనే కేసు పెట్టాల్సి వస్తుందని సీఐ అన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ లక్ష్మోజీ దగ్గరకు వెళ్లగా.. నాతో అసభ్యంగా మాట్లాడారు. లక్ష్మోజీ తన బంధువులైన రమేష్‌, సురేష్‌లకు అండగా ఉంటూ.. నన్ను బెదిరిస్తున్నారు. నాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అని లలిత ఆవేదన వ్యక్తం చేశారు.

"మేం గుడివాడ బాపూజీనగర్‌ 13వ వార్డులో నివసిస్తున్నాం. తిరుపతమ్మ చెరువు గట్టున మున్సిపాలిటీ స్థలంలో ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. మూడు రోజుల క్రితం బోరు వేసేందుకు కూలీలు పని చేస్తుండగా.. రోడ్డు అవతలివైపు ఉన్న రమేష్‌, సురేష్‌ వచ్చి మా సామాన్లు చెల్లాచెదురుగా పడేశారు. నాపై దాడి చేశారు. వాళ్లకు భయపడి అక్కడి నుంచి పారిపోయాను. తర్వాత వారిద్దరితోపాటు సురేష్‌ మామ సుబ్రహ్మణ్యం వచ్చారు. ముగ్గురూ కలిసి నన్ను కులం పేరుతో దూషించి అసభ్యంగా ప్రవర్తించారు. చుట్టుపక్కల వాళ్లు రావడంతో పారిపోయారు. డయల్‌ 100కు ఫోన్‌ చేయగా.. పోలీసులు వచ్చి వివరాలు తీసుకున్నారు. సాయంత్రం సీఐ దుర్గారావు పిలిపించారు. జరిగిందంతా ఆయనకు చెప్పాను. వెంటనే బోరు పనులు ఆపేయాలని, లేకపోతే తిరిగి నీపైనే కేసు పెట్టాల్సి వస్తుందని సీఐ అన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ లక్ష్మోజీ దగ్గరకు వెళ్లగా.. నాతో అసభ్యంగా మాట్లాడారు. లక్ష్మోజీ తన బంధువులైన రమేష్‌, సురేష్‌లకు అండగా ఉంటూ.. నన్ను బెదిరిస్తున్నారు. నాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా" -లలిత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.