ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిధులు లేవు, మాట్లాడే అవకాశం కూడా తీసేస్తే ఎలా.. వైకాపా సర్పంచుల ఆవేదన

By

Published : Sep 15, 2022, 3:48 PM IST

Etv Bharat
Etv Bharat ()

Sarpanches: అనంతపురం జిల్లా ఉరవకొండలో మండల సర్వ సభ్యా సమావేశానికి హాజరైన వైకాపా సర్పంచుల ఆవేదన.. అందరిని కదిలించింది. అభివృద్ది చేసేందుకు నిధులు లేవని, సొంత ఖర్చులతో అభివృద్ది చేసినా..సమావేశం మాట్లాడేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలనడంపై..వైకాపా సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము మాట్లాడొద్దు అని అనుకున్నప్పుడ సమావేశానికి ఎందుకు పిలిచారని వాపోయారు.

Sarpanches Agony: అనంతపురం జిల్లా ఉరవకొండ మండల సర్వ సభ్యా సమావేశంలో పలు గ్రామాల సర్పంచ్​లు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సభలో కనీసం తమ సమస్యలు చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడటానికి.. సభ అధ్యక్షుల అనుమతితోనే మాట్లాడాలంటే ఎలా అని వాపోయారు. తమ సొంత డబ్బులతో గ్రామాలలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, బిల్లుల గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. జోలెపట్టి అడక్కు తినే పరిస్థితి వచ్చిందని షేక్షనుపల్లి సర్పంచ్ లింగన్న ఆవేదన వ్యక్తం చేశారు.

ఉరవకొండ మండల పరిషత్ సమావేశం ఎంపీపీ చంద్రమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీటీసీ సభ్యులే మాట్లాడాలని.. సర్పంచులు ఏదైనా ప్రస్తావించాలనుకుంటే ఎంపీపీ అనుమతి తీసుకోవాలని చెప్పడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాట్లాడటానికి అవకాశం లేనప్పుడు సమావేశంలో ఎందుకు ఉండాలని వైకాపా సర్పంచులైన లింగన్న, రేణుమాకులపల్లి సర్పంచి రామాంజనేయులు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపటికి మళ్లీ తిరిగిరాగా వాదన చోటుచేసుకుంది. గ్రామాల్లో సమస్యలపై ప్రజలు నిలదిస్తున్నారని.. ఇక్కడ సమస్యలను ప్రస్తావించడానికి అవకాశం లేదని వాపోయారు. సభలో మాట్లాడటానికి ఎంపీపీఅనుమతి తీసుకోవాలని చెప్పడం దారుణమన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details